తొమ్మిది మంది 'ఫిరాయింపు ఎమ్మెల్యే'ల పరిస్థితి ఏంటి?
'దానం నాగేందర్ 'సీన్ రిపీట్ అవుతుందా ?
దానం నాగేందర్ పై హైకోర్టులో అనర్హత వేటు పడటంతో ఇప్పుడు మిగిలిన తొమ్మిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏమవుతుందన్న చర్చలు పెరిగిపోతూ ఉన్నాయి. మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్),పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ),తెల్లం వెంకటరావు (భద్రాచలం),ఎం. సంజయ్ కుమార్ (జగిత్యాల),ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్),
అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి),గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు),బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల),కాలె యాదయ్య (చేవెళ్ల).
ఒకవైపు దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటంతో బీఆర్ఎస్ ధీమాగా ఉంది.కానీ కడియం శ్రీహరి విషయంలో కొంత సాంకేతికంగా ఇబ్బంది ఉన్నా,మిగిలిన ఎమ్మేల్యులు మాత్రం తమ వాదనలతో బలంగానే ఉన్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురు వరంగల్ లో ఎంపిగా వరంగల్ లో కాంగ్రెస్ తరపున పోటి చేసినప్పుడు ఆ నామినేషన్ పత్రాలపై ఆయన సంతకం చేయడంతో ఇప్పుడు కడియం శ్రీహరి కూడా దానం నాగేందర్ లాంటి పరిస్థితిని ఎదుర్కుంటారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే, ఈ ఇద్దరినీ పక్కన పెడితే మిగిలిన ఎనిమిది మంది మాత్రం ఈ విషయంలో ధీమాగా ఉన్నారు.
దీని గురించి ఫిరాయింపు ఎమ్మేల్యులు తమని తాము సమర్థించుకోవడానికి రెండు వాదనలు వినిపిస్తున్నారు. ఒకటి బీఆర్ఎస్ ఎమ్మెల్యులుగా తమ జీతం నుండి బీఆర్ఎస్ పార్టీ పార్టీ సంక్షేమ నిధి కోసం కొంత కోత విధిస్తూ ఉందని, తాము బీఆర్ఎస్ కి చెందకపోతే వారెందుకు అలా చేస్తున్నారని వారు బీఆర్ఎస్ ఆరోపణలని తిప్పి కొడుతున్నారు. అంతే కాకుండా ఈ విషయం మీద ఇప్పటివరకూ బీఆర్ఎస్ పార్టీ తమను వివరణ కోరుతూ ఎటువంటి నోటిసులు ఇవ్వలేదని కూడా చెబుతున్నారు. అంతే కాకుండా తాము ముఖ్యమంత్రిని కలిసింది తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్ప వ్యక్తిగతంగా కాదని,ఎవరు అధికారంలో ఉన్నా తామే అదే చేస్తామని కూడా చెప్తున్నారు.

