
కావూరు డెత్ మిస్టరీ, ఎప్పుడు చనిపోయారు ?
బుధవారం తెల్లవారి 11.10 గంటలకు కావురు చనితారని ముందుగానే అంచనా వేసి మంగళవారం రాత్రికే దినపత్రికల్లో ఎవరూ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వరు కదా ?
కొన్ని అంశాలు మిస్టరీగా మారిపోతాయి. ఆ మిస్టరీపైన రకరకాల కథనాలు, ప్రచారాలు జరుగుతునే ఉంటాయి. అలాంటిదే ఇపుడు కేంద్రమాజీమంత్రి కావూరు సాంబశివరావు మరణం కూడా. నిజానికి కావురు మరణంలో ఎలాంటి మిస్టరీ లేదు. అయితే ఆయన ఎప్పుడు చనిపోయారు అన్న విషయమే జనాలను అయోమయంలోకి నెట్టేస్తోంది. విషయం ఏమిటంటే బుధవారం ఉదయం నుండి టీవీల్లో కావూరు మరణవార్త ప్రముఖంగా ప్రసారమవుతోంది. ఈరోజు ఉదయం 11.10 గంటలకు కావురు ఆసుపత్రిలో కన్నుమూసినట్లు టీవీ వార్తల్లో ప్రముఖంగా వస్తోంది.
అయితే కావురు మరణించినట్లు రెండురోజుల క్రితం అంటే సోమవారమే కొన్ని వెబ్ సైట్లలో వార్తలు ప్రముఖంగా వచ్చాయి. బుధవారం ఉదయం కావూరు చనిపోయినట్లు మెడికల్ ఆఫీసర్ సంతకంతో ఒక ప్రకటనను టీవీలు చూపుతున్నాయి. మెడికల్ ఆపీసర్ ప్రకటనే నిజం అనుకుంటే మరి రెండురోజుల ముందు సోమవారమే కావురు మరణించినట్లు వెబ్ సైట్లలో వార్తలు ఎలాగ వచ్చాయి ? బుధవారం ఉదయం 11 గంటలకు కావూరు మరణించిందే నిజమని కాసేపు అనుకుంటే మరి బుధవారం దినపత్రికల్లో ‘ఇక సెలవు’ అనే హెడ్డింగుతో ఫ్రంట్ పేజి ఫుల్లు అడ్వర్టైజ్మెంట్లు ఎలాగ వచ్చాయి ?
బుధవారం ఉదయం 11 గంటలకు కావూరు మరణించారు కాబట్టి పత్రికల్లో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు వస్తే గురువారం ఉదయం కనబడాలి. కాని అందుకు భిన్నంగా బుధవారం తెల్లవారే కావూరు మరణించారని ప్రకటనలు ఎలా అచ్చయ్యాయి ? అంటే మంగళవారం సాయంత్రమో లేకపోతే రాత్రో కావూరు చనిపోతేనే బుధవారం తెల్లారి పత్రికల అడ్వర్టైజ్మెంట్లలో కనబడే అవకాశం ఉంది. మంగళవారమే చనిపోయింది నిజమైతే బుధవారం ఉదయం చనిపోయినట్లు ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ ప్రకటన ఎందుకిచ్చారు ? బుధవారం తెల్లవారి 11.10 గంటలకు కావూరు చనితారని ముందుగానే అంచనా వేసి మంగళవారం రాత్రికే దినపత్రికల్లో ఎవరూ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వరు కదా ?
ఇన్ని గందరగోళాల మధ్య కావూరు నిజంగా చనిపోయింది ఎప్పుడు అన్నది అయోమయాన్ని పెంచేస్తోంది. గతంలో ప్రముఖ సినీనేపధ్య గాయని లతా మంగేష్కర్ తో పాటు మరికొందరు ప్రముఖులను కూడా మీడియా+సోషల్ మీడియా చాలాసార్లు ముందుగానే చంపేసిన విషయం గుర్తుండే ఉంటుంది. కావూరు మరణాన్ని కూడా వెబ్ సైట్లు, దినపత్రికలు, సోషల్ మీడియా ముందుగా అంటే సోమవారం, మంగళవారమే చంపేశాయా ? లేకపోతే సోమవారమే కావురు మరణించినా ఏవో కారణాల వల్ల ఆసుపత్రి యాజమాన్యమే దాచిపెట్టి ఆలస్యంగా ప్రకటించిందా ? ఇదే నిజమైతే ఎందుకు అన్నదే మిస్టరీగా మారింది.

