
కాంగ్రెస్ ఆరుగురు రాజ్యసభ అభ్యర్థులు ఎవరంటే..
తెలంగాణ నుంచి రెండో అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పోటీ..
రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు అభిషేక్ సింఘ్వి, ఫూలో దేవి నేతమ్‌లను కాంగ్రెస్ గురువారం తిరిగి నామినేట్ చేసింది. మార్చి 16న జరగనున్న ద్వైవార్షిక ఎన్నికలకు హర్యానా నుంచి పార్టీ నాయకుడు కరంవీర్ సింగ్ బౌధ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ శర్మను కూడా పార్టీ నామినేట్ చేసింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుకు సన్నిహితుడిగా పేరొందిన శర్మ ప్రస్తుతం కాంగ్రా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు.
అధికార డీఎంకే తమిళనాడు నుంచి ఆ పార్టీ ఎం క్రిస్టోఫర్ తిలక్‌ను బరిలోకి దింపింది. అలాగే తెలంగాణలోని రెండో స్థానానికి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని పోటీకి దింపింది. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు గురువారం (మార్చి5) ఆఖరు తేదీ.
Next Story

