టెలిఫోన్ ట్యాపింగ్ పై కవిత ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు ?
x
Telephone tapping and Kalvakuntla family

టెలిఫోన్ ట్యాపింగ్ పై కవిత ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు ?

బాధ్యులు ఒకవైపు బాధితులు మరోవైపుగా కుటుంబంలో చీలిపోయారు


టెలిఫోన్ ట్యాపింగ్ విచారణను వేగంగా పూర్తిచేయాలని కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బాగా ఒత్తిడి తెస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం ‘ట్యాపింగ్ లేదు ఏమీలేదు ఉన్నదంతా ప్రభుత్వం కక్షసాధింపే’ అని అంటుంటే కవిత మాత్రం ‘విచారణలో స్పీడుపెంచాలని, తొందరగా కేసును తేల్చాలి’ అని ప్రభుత్వాన్ని ప్రతిరోజు డిమాండ్ చేస్తున్నారు. ‘జనంబాట’ పేరుతో జనాల్లో తిరుగుతున్న కవిత తాను పర్యటిస్తున్న ప్రతిచోటా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి ? అన్నది చాలా కీలకంగా మారింది.

బీఆర్ఎస్ హయాంలో మిగిలిన వాళ్ళ ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ జరగటం వేరు తనతో పాటు భర్త అనీల్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ జరగటం వేరు. ‘ఇంటి ఆడబిడ్డను అనికూడా చూడకుండా ట్యాపింగ్ చేయటం నీచం’ అని మండిపోతున్నారు. అసలు తన ఫోన్ ను తమ తండ్రి ప్రభుత్వమే ట్యాపింగ్ చేయించింది అన్న విషయాన్నే తట్టుకోలేకపోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తన వ్యక్తిగత విషయాలను కూడా తండ్రి లేదా సోదరుడు కేటీఆర్ తెలుసుకున్నారు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ట్యాపింగ్ కేసును విచారించి వెంటనే దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ ట్యాపింగ్ ఎపిసోడ్ లో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ముగ్గురూ దోషులే అని అర్ధం వచ్చేట్లుగా కవిత ఆరోపణలు చేస్తున్నారు.

అదేదో సినిమా ఎవరిగోలవాడిదేలో క్యారెక్టర్లు ప్రవర్తిస్తున్నట్లుంది కల్వకుంట్ల కుటుంబసభ్యుల వ్యవహారం. బాధ్యులు ఒకవైపు బాధితులు మరోవైపుగా కుటుంబంలో చీలిపోయారు. తాను కూడా టెలిఫోన్ ట్యాపింగ్ బాధితులురాలినే అని కల్వకుంట్ల కవిత పదేపదే చెబుతున్నారు. తనతో పాటు తన భర్త ఫోన్ ను కూడి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని మండిపడుతున్నారు. ట్యాపింగ్ ఎపిసోడ్ కు కారణం అంటూ పరోక్షంగా కేటీఆర్ తో పాటు గుంటనక్కలే అని కూడా అంటున్నారు. ఇదేసమయంలో కేటీఆర్ మాట్లాడుతు అసలు ట్యాపింగే జరగలేదని ఒకసారి ట్యాపింగ్ విషయం పోలీసులకు సంబంధించిందే కాని తమకేమీ సంబంధంలేదని మరోసారి ఏదేదో మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాటల్లోనే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంగీకరిస్తున్నట్లే ఉంది.

అయితే ట్యాపింగ్ బాధ్యులు పూర్తిగా పోలీసు అదికారులే కాని తమకు ఎలాంటి సంబంధంలేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. పోలీసుశాఖ ఏమన్నా స్వయంప్రతిపత్తితో పనిచేస్తోందా ? పోలీసుశాఖ కూడా ముఖ్యమంత్రి ఆధ్వంర్యంలోనే కదా పనిచేస్తున్నది ? ఇంటెలిజెన్స్ బాస్ ఎవరుంటే వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రికే రిపోర్టు చేస్తారని అందరికీ తెలుసు. అలాంటి ట్యాపింగ్ ఎపిసోడ్ లో కేసీఆర్ కు సంబంధంలేకుండా ఎలాగుంటుంది ? సరే, ట్యాపింగ్ లో కేసీఆర్ పాత్రకు ఆధారాలు దొరికేంతవరకు బీఆర్ఎస్ నేతలు ఇలాగే మాట్లాడుతారనటంలో సందేహంలేదు.

ట్యాపింగ్ తో తమకు ఎలాంటి సంబంధంలేదని తప్పించుకునేందుకు కేటీఆర్, హరీష్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో ట్యాపింగ్ కేసులో కేటీఆర్, హరీష్, సంతోష్ ను గట్టిగా ఇరికించేందుకు కవిత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అందుకనే ట్యాపింగ్ కేసును తొందరగా విచారించాలని, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని పదేపదే డిమాండ్లు చేస్తున్నారు. తనను బలవంతంగా పార్టీలో నుండి గెంటేసిన నేతలపైన ఎలాగైనా కసి తీర్చుకోవాలన్న అజెండా కవిత మాటల్లో కనబడుతోంది. చివరకు సిట్ విచారణలో ఏమి తేలుతుంది ? ప్రభుత్వం ఏమిచేస్తుందో చూడాలి.

Read More
Next Story