అస్సాం ఎన్నికలను ఈ ఐదు అంశాలే శాసిస్తాయా?
x
ప్రతిపక్ష నేత గౌరవ్ గొగొయ్, ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ

అస్సాం ఎన్నికలను ఈ ఐదు అంశాలే శాసిస్తాయా?

కీలకంగా మారిన అక్రమ వలసలు, సీఏఏ అంశాలు


Click the Play button to hear this message in audio format

దేశంలో కీలకమైన నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం శాసనసభలకు ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈశాన్య రాష్ట్రమైన అసోంలోనూ ఎన్నికల కీలకంగా మారాయి. ఈ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలలో ఐదు అంశాలు ఫలితాలను నిర్ణయించబోతున్నాయి. అవేంటో చూద్దాం

1. బంగ్లా చొరబాటు

అసోంను దశాబ్ధాలుగా బంగ్లాదేశ్ నుంచి వస్తున్న అక్రమ వలసలు వేధిస్తున్నాయి. ఇది అస్సాం ఒప్పందంతో ముగిసినట్లే కనిపించినప్పటికీ వలసల తీవ్రత అలాగే ఉంది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయడానికి కఠిన చర్యలు తీసుకుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం వీటిని సరిగా అమలు చేయట్లేదని ఆరోపిస్తున్నాయి.
ముఖ్యంగా స్థానిక అస్సామీ వర్గాల సాంస్కృతిక, సామాజిక, భాషా గుర్తింపును కాపాడటానికి రాజ్యాంగ, శాసన, పరిపాలనా రక్షణలు లేకపోవడం గురించి చెబుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని తరిమికొడుతూ బీజేపీ మైలేజ్ తెచ్చుకుంటోంది. అయితే ముస్లింలను వేధిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
వలస చర్చలో రెండు ప్రధాన స్తంభాలు కీలకంగా మారాయి. జాతీయ పౌర రిజిస్టర్ (NRC), పౌరసత్వ సవరణ చట్టం (CAA) నవీకరణ. ప్రచార కథనాలలో ఇవే ఆధిపత్యం చెలాయిస్తాయని రాజకీయ విశ్లేషకులు, నిఫుణులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి కొద్ది సంఖ్యలో హిందువులు మాత్రమే దాని నిబంధనల ప్రకారం పౌరసత్వం కోరారని బీజేపీ వాదిస్తోంది.

2. బహిష్కరణ

బీజేపీ ప్రభుత్వం ముస్లిం ఆక్రమణదారులు ఆక్రమించి ఫారెస్ట్ భూములను విడుదల చేస్తూ ఆక్రమణదారులను తరిమికొడుతోంది. వీరిని తొలగించడంలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడా దయచూపకపోవడం ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. అటవీ, సత్రం, ఆలయం, ఇతర ప్రభుత్వ భూములను అక్రమ ఆక్రమణ నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పాలక కూటమి వాదిస్తుంది. దీనికి విరుద్ధంగా, ప్రతిపక్షం ఈ విధానాన్ని "తీవ్రమైన మానవతా సంక్షోభం"గా ప్రచారం చేస్తున్నాయి. ఇది కుటుంబాలను నిరాశ్రయులను చేసి, వీధుల్లో నివసించవలసి వచ్చిందని చెబుతున్నాయి.

3. బాల్య వివాహాలపై కఠిన చర్యలు

POCSO చట్టం కింద అనేక అరెస్టులు, విచారణలకు దారితీసిన బాల్య వివాహాలపై కఠిన చర్యలు రాబోయే ఎన్నికలలో మరొక ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. లోతుగా పాతుకుపోయిన సామాజిక దురాచారాన్ని నిర్మూలించడానికి పాలక కూటమి గట్టి చర్యలు తీసుకుంది. చట్టంలోని నిబంధనలు కఠినంగా అమలు చేసింది. అయితే ప్రతిపక్షం ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలోని "ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని" ఆరోపించే అవకాశం ఉంది.

4. అభివృద్ధి ప్రాజెక్టులు/సంక్షేమ పథకాలు

అస్సాం ప్రభుత్వం తన ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలను, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, కొత్త విమానాశ్రయాలు, జలమార్గాలలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, టాటా సెమీకండక్టర్ ప్లాంట్, అడ్వాంటేజ్ అస్సాం వ్యాపార సదస్సు, రెండవ ఎడిషన్ సందర్భంగా సంతకం చేసిన అనేక ఒప్పందాలను తమ ఘనతగా బీజేపీ ప్రచారం చేసుకుంటుంది. అయితే ప్రతిపక్షం మాత్రం వాటిని తూతూ ఒప్పందాలుగా ఆరోపిస్తోంది.
కేవలం మతప్రాతిపదికన రాజకీయాలు చేస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. ఈ ప్రాజెక్టుల కోసం భూములు సేకరించబడ్డాయని చెప్పబడుతున్న స్థానిక వర్గాల ఖర్చుతో వచ్చిందని వాదిస్తుంది. మహిళలకు సంక్షేమ పథకాలు కూడా కేంద్ర ఇతివృత్తంగా ఉంటాయి, బీజేపీ దాని మిత్ర పక్షాలు నెలవారీ ఆర్థిక సాయం రూ. 1,250, మహిళా వ్యవస్థాపకుల కోసం కార్యక్రమాలు, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను హైలైట్ అయ్యే అవకాశం ఉంది.
అసోం ఓటర్లలో మహిళలు దాదాపు సగం మంది ఉన్నందున ఇది ముఖ్యమైన పాత్ర వహించే అవకాశం ఉంది. మహిళలపై నేరాలు ఎక్కువగా ఉన్నాయని, అందరికి ప్రయోజనాల పంపిణీ అసమానంగా ఉందని ప్రతిపక్షం వాదిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు నియామకం కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఐదు సంవత్సరాలలో 1.6 లక్షల పైగా నియమాకాలు జరిగాయి. అలాగే టీ కార్మికుల సంక్షేమ పథకాలు కూడా ఎన్నికలలో కీలకపాత్ర పోషిస్తాయి.

5. జుబీన్ గార్గ్ మరణం

మరో ముఖ్యాంశం ఏమిటంటే, సెప్టెంబర్ 2025లో సింగపూర్‌లో ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మరణం, ఆ తర్వాత అతని హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై న్యాయం కోసం విస్తృత డిమాండ్లు వచ్చాయి. గాయకుడికి న్యాయం చేయడంలో బిజెపి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించనున్నాయి, అయితే పాలక పక్షం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, నిందితులను అరెస్టు చేసి, ఈ విషయం ప్రస్తుతం కోర్టు ముందు ఉందని నొక్కి చెబుతుంది.


Read More
Next Story