ఎన్నికలకీ 10 వేల కోట్లు అవసరమవుతాయి: ఈసీ
x

ఎన్నికలకీ 10 వేల కోట్లు అవసరమవుతాయి: ఈసీ

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి మూడు ఎన్నికలకు దాదాపు రూ. 10 వేల కోట్లు అవసరమవుతాయని ఎన్నికల సంఘం తెలిపింది.


లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి మూడు జమిలి ఎన్నికలకు దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈవీఎం లకీ జీవితకాలం 15 సంవత్సరాలే అని, వీటితో పాటు కంట్రోల్ యూనిట్లు(సీయూ), బ్యాలెట్ యూనిట్లు(బీయూ), వీవీప్యాట్ లు అవసరమవుతాయని, గత ఎన్నికల అవసరాల దృష్ట్యా మరికొన్ని అదనంగా సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఈసీ గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వానికి పంపిన లేఖలో వెల్లడించింది.

జమిలి ఎన్నికలకి దేశంలో దాదాపు 11.80 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ప్రతి పోలింగ్ స్టేషన్ లో రెండు ఈవీఎంలు ఉండాలని, అందులో ఒకటి లోక్ సభ అభ్యర్థుల కోసం, మరోకటి అసెంబ్లీ ఎన్నికలకు ఉండాలని లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రతి ఈవీఎం కు కనీసం ఒక బీయూ, సీయూ, వీవీప్యాట్ అవసరం.

మెషినరీ ఖర్చు

ఏకకాలంలో ఎన్నికల ఖర్చుకు 46 లక్షల బీయూలు, 33 లక్షల సీయూలు, 36 లక్షల వీవీప్యాట్ లు అవసరం అవుతాయని న్యాయమంత్రిత్వ శాఖ కు కమిషన్ రాసిన లేఖలో పేర్కొంది. 2023 ప్రారంభంలో ఈవీఎం తాత్కలిక ధర బీయూకీ రూ. 7900, సీయూకీ రూ. 9800, వీవీప్యాట్ ధర రూ. 16000 ఉందని లేఖలో పేర్కొంది. జమిలి ఎన్నికలపై న్యాయ శాఖ మంత్రిత్వ శాఖ పంపిన లేఖపై ఈసీ సమాధానం పంపుతూ ఈ వివరాలు జత చేసింది.

భద్రతా ఖర్చు అదనం

ఏకకాలంలో పోలింగ్ కోసం భారీ స్థాయిలో భద్రతా సిబ్బందిని వినియోగించాల్సి ఉంటుందని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల కోసం భారీ గా రిజర్వ్ బలగాలు మోహరించాల్సి ఉంటుందని వివరించింది. కొత్త యంత్రాల కోసం అదనపు గిడ్డంగుల సదుపాయాలు, ఇతర లాజిస్టిక్ సమస్యలను కలుపుకుని చూస్తే మొదటి జమిలి ఎన్నికలు 2029లోనే సాధ్యమవుతుందని వెల్లడించింది.

రాజ్యంగ సవరణలు

లోక్ సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలంటే కచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే అని నిఫుణులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని కనీసం ఐదు అధికరణలు ఇందుకోసం అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని వాటిలో కొన్ని నిబంధనల కోసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు సైతం అనుమతి తీసుకోవాలని కొంతమంది రాజ్యాంగ నిఫుణులు చెబుతున్నారు. అలాగే ఫిరాయింపుల ఆధారంగా అనర్హతకు సంబంధించిన రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ లో కూడా అవసరమైన మార్పులు అవసరమని ఎన్నికల సంఘం పేర్కొంది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించేందుకు మాజీ రాష్ఠ్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్యానెల్ ను ఏర్పాటు చేసింది.

Read More
Next Story