300 లీటర్ల తల్లిపాలిచ్చి జాతీయ రికార్డుకెక్కిన గృహిణి
x

300 లీటర్ల తల్లిపాలిచ్చి జాతీయ రికార్డుకెక్కిన గృహిణి

తల్లి పాలను దానం చేయడానికి ముందుకు రావాలంటున్న తమిళనాడుకు చెందిన బృందా..


Click the Play button to hear this message in audio format

శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు తల్లిపాల(Breast milk)లో లభిస్తాయి. అందులో ఉండే యాంటీబాడీస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శిశువు శారీరక ఎదుగుదల, మనోవికాసానికి తల్లి పాలు కీలకం. ప్రతి నవజాత శిశువు తల్లి పాలకు నోచుకోకపోవచ్చు. తక్కువ బరువున్న శిశువులకు ఇంటెన్సివ్ కేర్‌తో పాటు తల్లిపాలు అత్యవసరమని వైద్యులు చెబుతుంటారు.


తల్లిపాలకు నోచుకోని శిశువులకు నేనున్నానంటూ ముందుకొచ్చారు తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం తిరుచ్చి(Trichy) జిల్లా కటూరుకు చెందిన సెల్వ బృందా. గృహిణి అయిన బృందా 22 నెలల్లో 300 లీటర్లు తల్లి పాలను దానం చేసి జాతీయ రికార్డు నెలకొల్పారు. ఏప్రిల్ 2023 - ఫిబ్రవరి 2025 మధ్యకాలంలో బృందా తన తల్లి పాలను మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మిల్స్ బ్యాంక్‌కు దానం చేశారు. గతంలో చెంగల్పేటకు చెందిన తమరై సెల్వి రాజేంద్రన్ 154 లీటర్ల తల్లిపాలను ఇచ్చారు. ఆమె రికార్డును బృందా అధిగమించారు.

తన బిడ్డ పరిస్థితి మరొకరికి రాకూడదని..

ప్రస్తుతం రెండున్నరేళ్ల వయసున్న బృంద కూతురును పుట్టిన వెంటనే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచాల్సి వచ్చింది. తన కుమార్తె పూర్తిగా కోలుకోవడంలో తల్లి పాలు ఎలా కీలకంగా వ్యవహరించాయో ఆమె స్వయంగా చూశారు. అందుకే ఆమె ఇలా అంటారు. "తల్లులు తల్లి పాలను దానం చేయడానికి ముందుకు రావాలి. ఇది బలహీనంగా లేదా నెలలు నిండకముందే జన్మించిన శిశువుల ప్రాణాలను కాపాడటానికి సహాయపడుతుంది" అని బృందా ది ఫెడరల్‌తో అన్నారు.

అమృతం ఫౌండేషన్. .

బృందా ప్రయాణంలో అమృతం ఫౌండేషన్‌ది కీలక పాత్ర. తమిళనాడులోని ఈ NGO దాతల తల్లి పాలను సేకరించడం, పరీక్షించడం, పాశ్చరైజ్ చేయడం, ఆసుపత్రులకు ముఖ్యంగా నియోనాటల్ కేర్ యూనిట్లకు చేరవేస్తుంది.

Read More
Next Story