గత ఏడాది దేశంలో అమ్ముడు పోని ఇళ్లు 5.77 లక్షలు
x

గత ఏడాది దేశంలో అమ్ముడు పోని ఇళ్లు 5.77 లక్షలు

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నిరాశజనకంగా పరిస్థితులు, గత ఏడాది కంటే 4 శాతం పెరిగిన అమ్ముడు పోని గృహాలు


దేశంలో గత ఏడాదిలో అమ్ముడు పోని ఇళ్ల సంఖ్య నాలుగు శాతం పెరిగి దాదాపు 5.77 లక్షల యూనిట్లకు చేరిందని, ఇది దేశంలోని ఏడు ప్రధాన నగరాల పరిస్థితి అని తేలింది.

కొత్త ఇళ్ల సరఫరా డిమాండ్ ను మించిపోయిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తెలిపారు. దేశ ఐటీ రాజధానిగా పిలువబడే బెంగళూర్ లో అమ్ముడు పోనీ ఇళ్ల స్టాక్ 23 శాతం పెరిగింది.

ప్రాథమిక నివాస మార్కెట్ కు సంబంధించిన డేటా ప్రకారం.. ఈ నగరాల్లో అమ్ముడు పోని మొత్తం ఇళ్ల యూనిట్లు 2024 చివరి నాటికి 5,53,073 యూనిట్ల నుంచి 5,76,617 కు పెరిగాయి.

తగ్గిన డిమాండ్, కొత్త సరఫరా..
‘‘ఏటా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని ఇన్వెంటరీ 2025 చివరి నాటికి 4 శాతం పెరిగింది. దీనికి కారణం సంవత్సరంలో డిమాండ్ తగ్గడం, కొత్త సరఫరా పెరగడం’’ అని అనరాక్ చెప్పారు. 2025 లో భారత్ లోని ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడు పోని గృహాల యూనిట్లు ఈ విధంగా ఉన్నాయి.
ఢిల్లీ- ఎన్సీఆర్లో అమ్ముడుపోని ఇళ్ల స్టాక్ 2024తో పోలిస్తే 2025 చివరి నాటికి 5 శాతం పెరిగింది
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) లో అమ్ముడు పోని ఇళ్లలో ఒక శాతం స్వల్ప తగ్గుదల కనిపించింది.
బెంగళూర్ లో అమ్ముడుపోని ఇళ్ల స్టాక్ 23 శాతం పెరిగింది.
పూణేలో అమ్ముడుపోని ఇళ్ల స్టాక్ 3 శాతం పెరిగింది.
హైదరాబాద్ లో అమ్ముడు పోని ఇళ్ల సంఖ్య రెండు శాతం తగ్గింది.
చెన్నైలో అమ్ముడుపోని ఇళ్ల స్టాక్ 18 శాతం పెరిగింది.
కోల్ కతలో అమ్ముడుపోనీ ఇళ్ల సంఖ్య 9 శాతం పెరిగింది
గత ఏడాది టాప్ ఏడు నగరాల్లో గృహల అమ్మకాలు ఏటా 14 శాతం తగ్గి 3,95,625 యూనిట్లకు చేరుకోగా, కొత్త సరఫరా రెండు శాతం పెరిగి 4,19,1700 యూనిట్లకు చేరుకుంది.
అనరాక్ డేటా ప్రకారం.. అమ్ముడుపోనీ గృహాల స్టాక్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, హైదరాబాద్ లలో తగ్గింది. కానీ ఢిల్లీ- ఎన్సీఆర్, పూణే, బెంగళూర్, కోల్ కతలో పెరిగింది.
ఢిల్లీ- ఎన్సీఆర్ లో అమ్ముడు పోని ఇళ్ల స్టాక్ 2024 లో 85,901 యూనిట్ల నుంచి 2025 చివరి నాటికి ఐదు శాతం పెరిగి 90,455 యూనిట్లకు చేరుకుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య ఒక శాతం తగ్గి 1,80,964 యూనిట్ల నుంచి 1,79,228 యూనిట్లకు చేరుకుంది.
పూణేలో అమ్ముడు పోనీ ఇళ్ల స్టాక్ మూడు శాతం పెరిగి 80,672 యూనిట్ల నుంచి 83,491 యూనిట్లకు చేరుకుంది. హైదరాబాద్ లో అమ్ముడు పోని ఇళ్ల సంఖ్య రెండు శాతం తగ్గి 97,765 యూనిట్ల నుంచి 96,140 యూనిట్లకు చేరుకుంది.
చెన్నైలోని అమ్ముడుపోని ఇళ్ల స్టాక్ 18 శాతం పెరిగి 28,423 యూనిట్ల నుంచి 33,434 యూనిట్లకు చేరుకుంది. కోల్ కతలో పెరిగిన ఏడాది చివరి నాటికి అమ్ముడు పోని ఇళ్ల సంఖ్య 29,007 గా ఉంది.
ఇది 2024 చివరి నాటికి 26,542 యూనిట్ల నుంచి 9 శాతం పెరిగిందని డేటా చూపించింది. అంచనాల ప్రకారం గృహాల ధరలు నియంత్రణలో ఉంటే గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడంతో డిమాండ్ పెరుగుతుందని అనరాక్ విశ్వసిస్తోంది.
Read More
Next Story