అయోధ్యలో ఆ ఏడు రోజులు..
x

అయోధ్యలో ఆ ఏడు రోజులు..

అయోధ్య రామాలయ నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకం. ఏ రోజున, ఏ నక్షత్రంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది? అంతకుముందు వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలు ఏమిటి..


హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నరోజు రానే వచ్చింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న అంగరంగవైభవంగా జరగనుంది. ప్రారంభోత్సవానికి అతిరథ మహారధులు, అధిక సంఖ్యలు భక్తులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల ప్రముఖులకు ట్రస్టు తరుపున ఆహ్వానాలు కూడా అందాయి. ఇటు ప్రారంభోత్సవానికి రోజులు సమీపిస్తుండడంతో ఆలయ నిర్మాణ పనులు ఊరందుకున్నాయి.

ఆహ్వానాలు

7 రోజుల పాటు కార్యక్రమాలు..

అయోధ్యలో ఏడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. జనవరి 16 నుంచి 22వ తేదీ వరకు వీటిని నిర్వహించనున్నారు.

ఆలయ ట్రస్ట్ విడుదల చేసిన షెడ్యూల్‌..

జనవరి 16: సరయూ నది ఒడ్డున దశవిధ్ స్నానం, విష్ణు పూజ, గోదాన్.

జనవరి 17: రామ్‌లాలా విగ్రహంతో అయోధ్యకు ఊరేగింపు. మంగళ కలశాల్లో సరయూ జలాలతో భక్తులు ఆలయానికి చేరుకుంటారు.

జనవరి 18: గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరం, వాస్తు పూజ మొదలైనవి ఉంటాయి.

జనవరి 19: అగ్ని, నవగ్రహ స్థాపన

జనవరి 20: గర్భగుడిని సరయూ పవిత్ర జలంతో శుభ్రం చేశాక వాస్తు శాంతి, అన్నదివస్ నిర్వహిస్తారు.

జనవరి 21: 125 కలశాలతో మంగళ స్నానం, శాయాదివస్.

జనవరి 22: ఉదయం ఆరాధన తర్వాత, మధ్యాహ్నం మృగశిర నక్షత్రంలో రాముడి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది.

1 నుంచి వీహెచ్పీ ప్రచారం..

బీజేపీ అనుబంధ సంస్థ విశ్వహిందూ పరిషత్ జనవరి 1 నుంచి దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. శ్రీరామ మందిర ప్రారంభోత్సవం గురించి విస్త్రత నిర్వహించనున్నట్లు సమాచారం.

ప్రత్యేక రైళ్లు..

జనవరి 22న భక్తులను రామమందిరానికి తీసుకెళ్లేందుకు మహారాష్ట్రలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నట్లు ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ ఇప్పటికే పేర్కొన్నారు. అదే రోజు 'దీపోత్సవ్' (కాంతుల పండుగ) కోసం ముంబైలోని ప్రతి వార్డులో దాదాపు 10,000 ఇళ్లలో దీపాలు వెలిగించనున్నట్లు షెలార్ తెలిపారు. రాష్ట్రంలోని కమలం పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ సన్నాహాలు చేసినట్లు తెలిపారు.

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని..ముంబైలోని ప్రధాన ఆలయాల్లో జరిగే వేడుకలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులు పోలీసులను కోరాయి.

వారికి మాత్రమే అనుమతి..

రామ మందిర ఆలయ ప్రతిష్ఠాపన రోజున రామ మందిరం ట్రస్ట్ నుంచి ఆహ్వాన పత్రిక అందిన వారు, ప్రభుత్వ విధుల్లో ఉన్న వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారు. రద్దీ, భద్రత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.

పెరిగిన గిరాకి..

జనవరి 22న దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించాలని ఇప్పటికే పిలుపునివ్వడంతో మట్టి దీపాలకు, ఎలక్ట్రికల్ దీపాలు, అలంకరణ పూలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. దేశవ్యాప్తంగా హోర్డింగ్‌లు, పోస్టర్‌లు, బ్యానర్‌లు, కరపత్రాలు, స్టిక్కర్లకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. రామ మందిర ప్రారంభోత్స వేళ .. ఆర్కెస్ట్రా పార్టీలు, సింగర్స్ పాటలను కంపోజ్ చేస్తున్నారు.

నేడు అయోధ్యకు ప్రధాని..

ఈ రోజు (డిసెంబర్ 30) ప్రధానమంత్రి నరేంద్రమోదీ అయోధ్యను సందర్శించనున్నారు. దీంతో పోలీసులు నగరంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయోధ్య పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ రూ. 15,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

హిందువులందరికి గొప్ప రోజు..

రామమందిర ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రుల్లో ఒకరైన ఉత్తరప్రదేశ్ మంత్రి జైవీర్ సింగ్ మాట్లాడుతూ.. “జనవరి 22 వతేదీ ఉత్తరప్రదేశ్ ప్రజలకే కాకుండా సనాతన ధర్మాన్ని విశ్వసించే వారందరికీ కూడా గొప్ప రోజు. శ్రీరామ చరిత్రకు ఆద్యుడయిన మహర్షి వాల్మీకి పేరును అయోధ్య విమానాశ్రయానికి నామకరణం చేస్తున్నారు. పునరుద్ధరణ పనుల తర్వాత అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ తిరిగి ప్రారంభం కానుంది. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని మోదీని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం" అని పేర్కొన్నారు.

భారీ భద్రత..

లక్నో జోన్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ పీయూష్‌ మోర్దియా మాట్లాడుతూ.. ప్రధాని జిల్లా పర్యటన నేపథ్యంలో.. భద్రతకు ఏర్పాట్లలో బిజీగా ఉన్నాం. యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS), నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ (NSG) ) ఇతర భద్రతా బలగాలను మోహరించాం. డ్రోన్లతో సాయంతో అన్ని ప్రాంతాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

Read More
Next Story