‘ఖాతాదారుల నుంచి రూ.8500 కోట్లు ఆదాయం.. మోదీ చక్రవ్యూహంలో భాగం’
x

‘ఖాతాదారుల నుంచి రూ.8500 కోట్లు ఆదాయం.. మోదీ 'చక్రవ్యూహం'లో భాగం’

ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచనందుకు ప్రభుత్వ బ్యాంకులు కస్టమర్ల నుంచి పెనాల్టీ రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.


ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచనందుకు ప్రభుత్వ బ్యాంకులు కస్టమర్ల నుంచి పెనాల్టీ రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇలా చేయడం ప్రధాని మోదీ 'చక్రవ్యూహం'లో భాగమని ఆయన విమర్శించారు.

2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయని ఖాతాదారుల నుంచి కింద సుమారు రూ. 8,500 కోట్లు వసూలు చేశారు. లోక్‌సభలో రాహుల్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2024 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ కనీస నిల్వను నిర్వహించనందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు డిపాజిటర్లకు రూ. 2,331 కోట్ల జరిమానా విధించాయి.

‘వారికి 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ..’

“నరేంద్ర మోదీ అమృత్‌కాల్ సమయంలో సామాన్య భారతీయుల ‘ఖాళీ జేబులు’ కూడా దోచుకున్నారు. పారిశ్రామికవేత్తలకు రూ. 16 లక్షల కోట్లు మాఫీ చేసిన ప్రభుత్వం.. 'మినిమమ్ బ్యాలెన్స్' మెయింటెన్ చేయలేని పేద భారతీయుల నుంచి రూ. 8,500 కోట్లు రికవరీ చేసింది. 'పెనాల్టీ సిస్టమ్' ద్వారా సామాన్య భారతీయుడి వెన్ను విరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే భారతీయులు అభిమన్యు లాంటి వారు కాదు, అర్జునుడి లాంటి వారనిని గుర్తుంచుకోండి. మీకు ఎలా సమాధానం చెప్పాలో వారికి బాగా తెలుసు." అని కాంగ్రెస్ మాజీ చీఫ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

Read More
Next Story