AAP ఎన్నికల హామీ | ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల బీమా: కేజ్రీవాల్
x

AAP ఎన్నికల హామీ | ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల బీమా: కేజ్రీవాల్

‘అధికారంలోకి వస్తే రూ.10 లక్షల బీమాతో పాటు ఆటో డ్రైవర్ల కుమార్తెల పెళ్లికి రూ.లక్ష సాయం చేస్తాం’ - ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు తాయిలాలు ప్రకటించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీలోని ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రూ.10 లక్షల బీమాతో పాటు ఆటో డ్రైవర్ల కుమార్తెల పెళ్లికి రూ.లక్ష సాయం అందిస్తానని ప్రకటించారు. కొండ్లీ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన కేజ్రీవాల్..ఆటో డ్రైవర్లకు యూనిఫాం అలవెన్స్‌గా ఏడాదికి రెండుసార్లు రూ.2,500 ఇవ్వనున్నట్లు చెప్పారు. వారి పిల్లలకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తామన్నారు. ఆటో డ్రైవర్ల కోసం 'పూచో' యాప్‌ను పునఃప్రారంభిస్తామని కూడా హామీ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌తో తలపడిన ఆప్ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత సంచలన ప్రకటన చేశారు. ప్రజలు తనకు నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతే మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని చెప్పి తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిశీ ముఖ్యమంత్రిగా అయ్యారు.

Read More
Next Story