
‘బెంగాల్ నుంచి చొరబాటుదారులను తరిమికొడతాం’
తృణమూల్ కాంగ్రెస్ పాలనపై కేంద్ర హోం మంత్రి విమర్శలు..
కేంద్రం హోం మంత్రి అమిత్ షా(Amit Shah) పశ్చిమ బెంగాల్(West Bengal) సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee)పై విరుచుకుపడ్డారు. అక్రమచొరబాటుదారులకు వెస్ట్ బెంగాల్ ఆశ్రయం ఇస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులు, చొరబాటుదారుల ఆటకట్టిస్తామన్నారు. జాతీయ గ్రిడ్ ఏర్పాటుతో పశ్చిమ బెంగాల్ సరిహద్దు వెంట కంచె ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (S.I.R) జరుగుతోంది. అలాగే పశ్చిమ బెంగాల్‌లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షా కోల్‌కతాలో మంగళవారం (డిసెంబర్ 30) ఈ వ్యాఖ్యలు చేశారు.
తాము అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. అక్రమ వలసదారులను నిలువరించడమే కాకుండా చొరబాటుదారులను దేశం నుంచి తరిమికొడతామన్నారు.
బెంగాల్‌లో గత 15 సంవత్సరాల టీఎంసీ పాలనలో అక్రమ వలసదారుల కారణంగా రాష్ట్ర ప్రజల్లో భయం, అవినీతి గూడుకట్టుకున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.

