
విజయవాడలో జరిగిన పెన్షనర్స్ పార్టీకి హాజరైన రీటైర్డ్ సీఎస్ ఎల్‌వి సుబ్రమణ్యం
ఏపీలో గెలుపు ఓటములను డిసైడ్ చేస్తామంటున్న ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీస్తున్న కొద్దీ కొత్త పార్టీలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న కొన్ని మనుగడ లేని పార్టీలు కూడా బ్యానర్లు, ప్రెస్‌మీట్లతో తెరపైకి వస్తున్నారు. వీరు గెలుద్దామని అనుకోవడం లేదు. మేమున్నామని చెబుతున్నారు. అయితే కొత్తగా రిజిష్టర్ అయిన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ మాత్రం ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేస్తామంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీల గెలుపు ఓటములను డిసైడ్ చేస్తాం. మా సత్తా ఏమిటో చూపిస్తాం. మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, అలాగని అనుకూలమూ కాదు. ఎవరైనా అటువంటి అపోహల్లో ఉంటే కరెక్ట్ కాదని ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు పి సుబ్బరాయన్ స్పష్టం చేశారు. ఆయన ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ గత సంవత్సరం నవంబరు నుంచి పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్టార్ట్ చేశామని, 2023 ఆగస్టుకు మాకు రిజిస్ట్రేషన్ వచ్చిందన్నారు.
కేవలం పెన్షనర్స్ పార్టీ పెట్టడం దేశంలోనే వినూత్నం. పెన్షనర్ల సమస్యలే ఎజెండాగా ఎన్నికల్లోకి వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడేం జరుగుతుంది. పెన్షనర్స్‌కు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. పెన్షనర్లు పడుతున్న బాధలు ఎవరూ పట్టించుకోరు. వయసులో ఉన్నందకాలం తమ సేవలు వినియోగించుకున్న ప్రభుత్వాలు వారికి రావాల్సిన పెన్షన్‌ను సకాలంలో ఇవ్వడం లేదు. పైగా ఇప్పుడు పెన్షన్ లేని విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. దీనిని పూర్తిగా వారు వ్యతిరేకిస్తున్నాం.
జనవరిలో విజయవాడలో పెన్షనర్స్ పార్టీ ఆఫీసు
జనవరి నెలలో విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు కానుంది. తెలంగాణలో బర్రెలక్క ఎలియాస్ సిరీష గెలుస్తుందని పోటీ చేసిందా? ఆమె స్పూర్తి పలువురికి పలువురికి ఆదర్శం.
ఇదో వినూత్న ప్రయోగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల పార్టీ ఆవిర్భాం ఒక వినూత్న ప్రయోగమని చెప్పవచు. తాము ఎవ్వరికీ వ్యతిరేకం కాదని అంటున్నా ఓటర్ల చీల్పులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రిటైర్డ్ ఉద్యోగులందరూ ఒక ప్రత్యేకమైన ఆలోచనా విధానంతో ఉంటారు. ప్రజా స్వామ్య విధానాలను రక్షిద్దామనే ఆలోచనకు వారు ఊపిరి పోస్తారనడంలో సందేహం లేదు. రానున్న ఎన్నికల్లో జేడీ లక్మీనారాయణ కొత్త పార్టీని పెట్టి పోటీ చేస్తానని ప్రకటించారు. పెన్షనర్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ రంగంలోకి దిగారు. ఎవరి ధీమా ఏమిటో, ఓటర్లు ఎవరిని ఏవిధంగా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.
పెన్షనర్ల పార్టీకి ఎపీ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఎల్‌వి సుబ్రమణ్యం సపోర్టు
ఆంథ్ర«ప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఆవిర్బవించిన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ నూతన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రమణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన కూడా రిటైర్డ్ అధికారి కావడం వల్ల రిటైర్డ్ పెన్షనర్స్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయా పార్టీల రియాక్షన్ ఏమిటో చూద్దాం.
Next Story