‘ఢిల్లీకి రూ.10వేల కోట్లు ఇవ్వండి’
x

‘ఢిల్లీకి రూ.10వేల కోట్లు ఇవ్వండి’

కేంద్రం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రోడ్డు, రవాణా, విద్యుత్ మౌలిక సదుపాయాలతో పాటు నగరాన్ని సుందరీకరణకు మరింత డబ్బు అవసరమని అతిషి చెప్పారు.


మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.10వేల కోట్లు కేటాయించాలని ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి కేంద్రాన్ని కోరారు. ఇన్‌కమ్ ట్యాక్స్ కంట్రిబ్యూషన్‌గా రూ. 2 లక్షల కోట్లు ఇస్తున్నా.. సంవత్సరం నుంచి తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఏమీ రాలేదని పేర్కొన్నారు.

ఢిల్లీ కూడా సెంట్రల్ జిఎస్‌టి కింద రూ.25,000 కోట్లు ఇచ్చిందని విలేకరుల సమావేశంలో అన్నారు. కేంద్రం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రోడ్డు, రవాణా, విద్యుత్ మౌలిక సదుపాయాలతో పాటు నగరాన్ని సుందరీకరణకు మరింత డబ్బు అవసరమని చెప్పారు.

2001 నుంచి కేంద్రం కేవలం రూ.325 కోట్లు మాత్రమే చెల్లిస్తోందని చెప్పారు. ఈ చెల్లింపును కూడా గత సంవత్సరం నిలిపివేశారని, ఇప్పుడు నగరానికి ఒక్క రూపాయి కూడా రాలేదని వివరించారు.

Read More
Next Story