పూర్తికానున్న ‘‘అయోధ్య రామ్ దర్బార్ ’’
x

పూర్తికానున్న ‘‘అయోధ్య రామ్ దర్బార్ ’’

పన్నుల్లో నిమగ్నమైన జైపూర్‌‌కు చెందిన 20 మంది కళాకారులు


Click the Play button to hear this message in audio format

అయోధ్య(Ayodhya)లో మరో ఘట్టం ఆవిషృతం కాబోతుంది. ఆలయ మొదటి అంతస్తులో ‘‘రామ్ దర్బార్’’ నిర్మాణం జరుగుతోంది. ప్రశాంత్ పాండే నేతృత్వంలో జైపూర్‌‌కు చెందిన 20 మంది కళాకారులు పన్నుల్లో నిమగ్నమయ్యారు.

గతేడాది ప్రాణప్రతిష్ఠ..

గతేడాది రామ్‌లల్లా(Ram Lalla)కు 'ప్రాణ ప్రతిష్ఠ' జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి 8వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు. రామ్‌లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విషయం తెలిసిందే.

2020లో పనులు మొదలు..

సుప్రీంకోర్టు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశాక 2020లో ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. వాస్తవానికి నిర్మాణం మొత్తం ఏప్రిల్ 15 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే విగ్రహాల తయారీలో ఆలస్యం వల్ల నిర్మాణం పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 90 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, పార్కోటాతో సహా మొత్తం కాంప్లెక్స్ ఈ ఏడాదిలోపు పూర్తవుతుందని అంతర్గత వర్గాల సమాచారం.

Read More
Next Story