బంగ్లా మైనారిటీ అధికారి హత్య కేసు: ఢిల్లీలో నిందితుడి పట్టివేత
x

బంగ్లా మైనారిటీ అధికారి హత్య కేసు: ఢిల్లీలో నిందితుడి పట్టివేత

సంతోష్ చౌదరిని సజీవంగా దహనం చేసిన ఇస్లామిక్ మూకలు, కీలక సూత్రధారి బంగ్లా నుంచి న్యూఢిల్లీ రాక


Click the Play button to hear this message in audio format

గత ఏడాది బంగ్లాదేశ్ లో మైనారిటీ పోలీస్ అధికారిని హత్య చేసి భారత్ కు పారిపోయి వచ్చిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూరప్ కు పారిపోవడానికి ప్రయత్నించగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

నిందితుడిని అహ్మద్ రజా హసన్ మెహదీగా పేర్కొన్నారు. యూరోప్ విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అతని నేపథ్యానికి సంబంధించిన సమాచారం ఆధారంగా, అధికారులు అతన్ని విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని, కస్టడీలో ఉంచారు. అవసరమైన విధానాలను అనుసరించి, మెహదీని బంగ్లాదేశ్‌కు పంపిచినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

రాజకీయ తిరుగుబాటు సమయంలో హత్య

బంగ్లాదేశ్‌లోని హబీగంజ్ నివాసి మెహదీ, ఆగస్టు 5, 2024న సబ్-ఇన్‌స్పెక్టర్ సంతోష్ చౌదరిని హత్య చేశాడు. అప్పటి నుంచి దేశం నుంచి పారిపోయి బంగ్లాదేశ్ కు వచ్చాడు. దేశవ్యాప్తంగా తీవ్రంగా నిరసనలు జరుగుతున్న సమయంలో ఈ హత్య జరిగింది. తరువాత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలు అయింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా తీవ్రంగా ఘర్షణలు, మైనారిటీలపై దాడులు జరిగాయి.
హబీగంజ్‌లోని బనియాచాంగ్ పోలీస్ స్టేషన్ ఆవరణకు చేరుకున్నప్పుడు చౌదరిని అక్కడ నియమించారు. నివేదికల ప్రకారం.. ఉద్రిక్తతలు పెరగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఫలితంగా ఆరుగురు మరణించారు. తరువాత ఆగ్రహించిన నిరసనకారులు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి నిప్పంటించారు.

దారుణమైన హత్య..

స్టేషన్ కు నిప్పటించిన సమయంలో అనేక మంది పోలీసులు అందులో ఉన్నారు. బయటకు వచ్చిన చౌదరిని గుంపు దారుణంగా కొట్టి సజీవ దహనం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. తరువాత ఆయన మృతదేహం చెట్టుకు వేలాడదీశారు. ఈ సంఘటన తరువాత విడుదల అయిన ఒక వీడియోలో చౌదరి హత్యకు మెహదీ బాధ్యత వహించాడని తెలిసింది.
హింస చెలరేగినప్పుడు చౌదరికి వివాహం జరిగి ఒక సంవత్సరం కూడా కాలేదు. ఆయన మరణించిన మూడు నెలల తర్వాత, ఆయన భార్య ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఆయన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. మెహ్దీ బహిష్కరణ తర్వాత బంగ్లాదేశ్‌లోని అధికారులు తదుపరి చట్టపరమైన చర్యలను కొనసాగించాలని భావిస్తున్నారు.
Read More
Next Story