మధ్యాహ్న భోజన పథకంలో పోషకాలు పెంచేందుకు మమత సర్కార్ ఏం చేస్తుంది ?
x

మధ్యాహ్న భోజన పథకంలో పోషకాలు పెంచేందుకు మమత సర్కార్ ఏం చేస్తుంది ?

కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR)ను ప్రోత్సహించే దిశగా పశ్చిమ బెంగాల్..


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో 2024–25 విద్యా సంవత్సరంలో 30 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి (mid day meal) ఇష్టపడడం లేదు. విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గడానికి ఆహార నాణ్యత, పంపిణీలో అవకతవకలే కారణమని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో బయటపడింది. ఏడాది కాలంలో మధ్యాహ్న భోజన విద్యార్థుల సంఖ్య దాదాపు10 లక్షలకు పడిపోవడం గమనార్హం. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించింది. అన్ని పాఠశాలలు తమ వద్ద అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని ఆహార నాణ్యతను పెంచాలని సమగ్రశిక్షా మిషన్ గత వారం ఓ సూచన చేసింది. వివిధ రకాల కూరగాయలు, చేపలను ఆహారంతో కలిసి తీసుకోవడం ద్వారా మధ్యాహ్న భోజన పథకంలో పోషక విలువలను పెంచవచ్చని భావించిన మిషన్..పాఠశాలల ఖాళీ ప్రాంగణంలో కూరగాయల సాగు చేపట్టాలని సూచించింది. వీలయితే పాఠశాలకు అనుబంధంగా ఉన్న ఖాళీ ప్రదేశాలను చెరువుల్లాగా మార్చి చేపల పెంపకం చేపట్టాలని మార్గనిర్దేశం చేసింది. చేపల పెంపకంపై ఉచిత శిక్షణ, వాటిని ఉచితంగా ఇచ్చేందుకు ఇప్పటికే మత్స్య శాఖను సంప్రదించింది సమగ్రశిక్షా మిషన్.


కృతిమ చెరువులు, స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్స్..

నార్త్ 24 పరగణాలలోని కంకానగర్ సృష్టిధర్ ఇన్స్టిట్యూషన్ తన సొంత క్యాంపస్‌లోని కృత్రిమ చెరువు తయారుచేసి చేపల పెంపకం చేపట్టింది. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలు కూరగాయల సాగును ప్రయోగాత్మకంగా చేపట్టాయి. ప్రస్తుతం దాదాపు 13,500 పాఠశాలలు స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్స్ (SNG) చేపడుతున్నాయి. ఈ గార్డెన్ల అభివృద్ధికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సీ ఫండ్ నుంచి ఒక్కో పాఠశాలకు రూ.5,000 కేటాయిస్తుంది.


టెర్రస్‌పై కూరగాయల సాగు..

తూర్పు బుర్ద్వాన్ జిల్లాలోని రైనాలోని మదానగర్ ఉన్నత పాఠశాల SNG చేపడుతోంది. ఈ పాఠశాల పైఅంతస్థులో డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చే మొక్కలను సాగుచేస్తున్నారు. కోల్‌కతాలోని బెహాలా ప్రాంతంలోని చిల్డ్రన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైస్కూల్‌లో విద్యార్థులు తమ టెర్రస్‌పై క్యాబేజీ, పాలకూర, పుట్టగొడుగులు, కాలీఫ్లవర్, బ్రోకలీ లాంటి కాలానుగుణ కూరగాయలను పెంచుతున్నారు.

మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ. 6.78, ప్రాథమికోన్నత విద్యార్థికి రూ. 10.17. ఖర్చు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెంచేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను వినియోగించుకునే ఆలోచనలో ఉంది.


Read More
Next Story