స్పెషల్ స్టేటస్‌కు ‘నో’.. అన్నీ నిదానంగా తెలుస్తాయన్న బీహార్ సీఎం..
x

స్పెషల్ స్టేటస్‌కు ‘నో’.. అన్నీ నిదానంగా తెలుస్తాయన్న బీహార్ సీఎం..

బీహార్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఈ మేరకు సోమవారం పార్లమెంట్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది.


బీహార్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఈ మేరకు సోమవారం పార్లమెంట్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయిన జేడీ(యూ)చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని ఆర్జేడీ డిమాండ్ చేసింది. విలేఖరుల అడిగిన ప్రశ్నకు ‘‘అన్ని విషయాలను నెమ్మదిగా తెలుస్తాయి.’’ (సబ్ కుచ్ ధీరే ధీరే జాన్ జైయేగా )" అని చెప్పి అసెంబ్లీలోకి వెళ్లిపోయారు.

ప్రత్యేక హోదా డిమాండ్..

లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి మెజారిటీ రాలేదు. మిత్రపక్షాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ఇదే సమయంలో జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి ప్రత్యేక హోదా డిమాండ్‌ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న JD(U) ఇద్దరు మంత్రులు బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడారని సమాచారం.

నితీష్ రాజీనామా చేయాలి: ఆర్జేడీ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయినా నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఆర్డేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ డిమాండ్ చేశారు. BJP నేతృత్వంలోని NDAలోకి తిరిగి రావడానికి ఈ సంవత్సరం జనవరిలో కుమార్ RJD నేతృత్వంలోని మహాఘటబంధన్, బీహార్ ఏర్పాటుకు సహకరించిన భారత కూటమి యొక్క బీహార్ నమూనాను రద్దు చేశారు.

బీహార్ అభ్యర్థనను కేంద్రం ఎందుకు తిరస్కరించింది?

బీహార్ కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సాధ్యపడదని కేంద్రం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. వర్షాకాల సమావేశాల మొదటి రోజు..లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. గతంలో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) నివేదిక మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదాను ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్‌డిసి నిబంధనల ప్రకారం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. గతంలో బీహార్‌కు ప్రత్యేక హోదా అంశంపై అంతర్‌ మంత్రిత్వ శాఖల బృందం అధ్యయనం చేసి..2012 మార్చి 30 నివేదిక ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఎన్‌డిసి నిబంధనల ప్రకారం బీహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని, 2012లో అంతర్‌ మంత్రిత్వ శాఖల బృందం నివేదిక తేల్చి చెప్పిందన్న కేంద్రం వెల్లడించింది.

2000 సంవత్సరంలో ప్రత్యేక హోదా డిమాండ్..

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్న సమయమది. 2000 సంవత్సరంలో బీహార్‌కు ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్ వినిపించింది. జార్ఖండ్ రాష్ట్రంలోకి విలువైన ఖనిజ సంపద, పారిశ్రామిక ప్రాంతాలు వెళ్లిపోయినపుడు ఈ డిమాండ్ తెరమీదకు వచ్చింది. 2010లో నితీష్ కుమార్ భారీ ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినపుడు ప్రత్యేక హోదా డిమాండ్ మరింత పెరిగింది.

Read More
Next Story