బీహార్‌లో NDA మేనిఫెస్టో రిలీజ్..
x

బీహార్‌లో NDA మేనిఫెస్టో రిలీజ్..

యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య..మహిళలకు రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం.. ఇంకా ఎన్నో..


Click the Play button to hear this message in audio format

2025 బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) శుక్రవారం (అక్టోబర్ 31) ఎన్నికల మ్యానిఫెస్టో(Manifesto) విడుదల చేసింది.

‘సంకల్ప పత్ర’ పేరుతో పాట్నాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఎల్జేపీ (రాంవిలాస్‌) పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాసవాన్‌ కూడా పాల్గొన్నారు.

మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలివే..

♦ రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.

♦ యువత నైపుణ్యాభివృద్ధికి ప్రతి జిల్లాలో నైపుణ్య కేంద్రం ఏర్పాటు

♦ శిక్షణ పొందిన యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలను పొందడంలో సాయం

♦ మహిళలకు రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం

♦ కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య

♦ ఏడాదికి రూ.లక్ష వరకు సంపాదించేలా కోటి మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీ’లుగా మార్చడమే లక్ష్యం

♦ మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.2 లక్షల వరకు ఆర్థికసాయం.

♦ అత్యంత వెనుకబడిన తరగతుల (EBCs) అభ్యున్నతికి రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం, వారి అవసరాలకు అనుగుణంగా కొత్త సంక్షేమ పథకాల రూపకల్పనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు హామీ

♦ కనీస మద్దతు ధర (MSP)‌ రైతుల పంట ఉత్పత్తుల కొనుగోలు.

♦ కర్పూరీ ఠాకూర్‌ కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.9వేలు పెట్టుబడి సాయం. మూడు విడతల్లో ఈ మొత్తం చెల్లింపు

♦ బిహార్‌లో ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు, నాలుగు నగరాల్లో మెట్రో రైలు సేవల ఏర్పాటు.

♦ 5 ఏళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటు

♦ గిగ్‌ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం

♦ ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు , మెడికల్‌ కాలేజీల ఏర్పాటు

243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది.

Read More
Next Story