S.I.R పరిశీలనలో భారీగా అక్రమ వలసదారులు
x

S.I.R పరిశీలనలో భారీగా అక్రమ వలసదారులు

ఎక్కువగా నేపాలీలు, బంగ్లాదేశీయులే..


Click the Play button to hear this message in audio format

బీహార్‌(Bihar)లో ఓటరు జాబితా సవరణ(S.I.R) జరుగుతోంది. ఎలక్షన్ కమిషన్ క్షేత్ర స్థాయి సిబ్బంది డోర్ టు డోర్ తిరుగుతున్నారు. నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వారే అధిక సంఖ్యలో నివాసం ఉంటున్నట్లు వారు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఓ ప్రకటన చేసింది. అక్రమవలసదారుల (Illegal immergrants) పేర్లు సెప్టెంబర్ 30వ తేదీన ప్రచురించే తుది ఓటరు జాబితాలో ఉండవని పేర్కొంది.

అక్రమ వలసదారులు తప్పుడు మార్గంలో సంపాదించుకున్న ఆధార్, రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాన్ని ఈసీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. వీటిని బదులుగా బర్త్ సర్టిఫికేట్ చూపాలని అడుగుతోంది. కొన్ని పార్టీలు S.I.Rను నిలిపివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారించిన న్యాయస్థానం.. ఓటరు కార్డు ధృవీకరణ కోసం ఆధార్, రేషన్ కార్డుల్లో ఏదో ఒకదాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు ECని సూచించింది.

జూన్ 24న ఈసీ ప్రారంభించిన S.I.R (Special Intensive Revision) ను సుప్రీం కోర్టు ఆపేయాలని చెప్పలేదు. కాని ఈ ప్రక్రియ వల్ల నిజమైన ఓటర్లు నష్టపోకుండా చూడాలని మాత్రం ఆదేశించింది. బీహార్‌లో ఇలాంటి ప్రక్రియ చివరిసారిగా 2003లో జరిగింది. పట్టణ విస్తరీకరణ, వలసలు, కొత్త ఓటర్ల చేరిక, మరణాలు, అక్రమ వలసల కారణంగా S.I.R అవసరమని EC పేర్కొంది. బర్త్ సర్టిఫికేట్‌ ఆధారంగా అక్రమ వలసదారులను తొలిగించే ఈ ప్రక్రియ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరగనున్నట్లు EC స్పష్టం చేసింది. ఈ సంవత్సరం బీహార్ ఎన్నికలు (Assembly Elections) జరగనున్నాయి. మరో ఐదు రాష్ట్రాలు అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 లో జరగనున్నాయి.

Read More
Next Story