
టీఎంసీ చీఫ్ మమతను ఢీ కొట్టడానికి బీజేపీ కొత్త వ్యూహాలు..
పార్టీలో అంతర్గత విభేదాలను చెక్ పెట్టి ఐక్యత తీసుకురావడం, యువతను ఆకట్టుకోవడంపైనే దృష్టి..
పశ్చిమ బెంగాల్(West Bengal)లో మరో ఆరేడు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్నాయి. ఇటు పార్టీలు ఇప్పుటి నుంచే గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. పరోక్షంగా ప్రజల వద్దకు చేరుకోవడంపై దృష్టి పెట్టాయి. అందులో భాగంగా సాంస్కృతిక(Cultural) కార్యక్రమాలు(Cultural), ఫుట్‌బాల్ పోటీల నిర్వహణపై కాషాయ పార్టీ(BJP) దృష్టి సారిస్తోంది.
కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ప్రత్యామ్నాయంగా అదే స్థాయిలో చలన చిత్రోత్సవాలను నిర్వహించడం, అలాగే 'నరేంద్ర కప్ ఫుట్‌బాల్ టోర్నీని త్వరలో నిర్వహించనున్నారు.
వివాదాస్పద చిత్రం విడుదల..
సమాంతర చలనచిత్రోత్సవాల్లో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన వివాదాస్పద చిత్రం ‘‘ది బెంగాల్ ఫైల్స్’’ ప్రమోషన్ బీజేపీ సాంస్కృతిక వ్యూహంలో ఒక భాగం. ఈ చిత్రం సెప్టెంబర్ 5న జాతీయ స్థాయిలో విడుదలయినా, బెంగాల్‌లో ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వలేదు. ఈ సారి బెంగాల్‌లోని కేంద్ర ప్రభుత్వ ఆడిటోరియంలను అద్దెకు తీసుకునే నవంబర్‌లో ఈ సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బాధ్యతను పార్టీలోని రాజకీయ నాయకులుగా మారిని ఇద్దరు నటులు రూపా గంగూలీ, రుద్రనిల్ ఘోష్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ‘‘ది బెంగాల్ ఫైల్స్’’ సినిమాతో పాటు భారతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ చిత్రాలను కూడా ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.
ఫుట్‌బాల్ టోర్నీలు..
యువతను ఆకట్టుకునేందుకు ఫుట్‌బాల్ పోటీల నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా రాష్ట్రంలోని 43 బీజేపీ సంస్థాగత జిల్లాల్లో టోర్నీ ప్రారంభమైంది. ఫైనల్ మ్యాచ్ ప్రధాని మోదీ పుట్టినరోజున (సెప్టెంబర్ 17న) జరగనుందని పురులియాకు చెందిన బీజేపీ ఎంపీ, నిర్వాహక కమిటీ కన్వీనర్ జ్యోతిర్మయ్ సింగ్ మహతో ది ఫెడరల్‌కు చెప్పారు.
గెలిచినా, ఓడినా నగదు బహుమతి..
విజేతలైన ఒక్కో జట్టకు రూ.50వేల చొప్పున 43 జట్లకు, అలాగే రన్నరప్‌కు రూ.25వేలు అందజేయనున్నారు. యువతలో స్నేహభావాన్ని పెంపొందించేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. బెంగాల్‌లో బీజేపీలోని అంతర్గత విభేదాల దృష్ట్యా..ఐక్యతను తీసుకురావడానికి ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర అధ్యక్షుడిగా సమిక్ భట్టాచార్య బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు గడిచినా..తీవ్ర విభేదాల కారణంగా ఇప్పటివరకు కొత్త కమిటీని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు.