పాట్నాకు చేరిక బీఎస్ఎఫ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పార్థివ దేహం..
x

పాట్నాకు చేరిక బీఎస్ఎఫ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పార్థివ దేహం..

అధికారిక లాంఛనాలతో సారణ్ జిల్లాలో అంత్యక్రియలు..


Click the Play button to hear this message in audio format

జమ్మూ్కశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో పాక్ కాల్పుల్లో మరణించిన బీఎస్ఎఫ్ (BSF) సబ్‌ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ ఇమ్తియాజ్ పార్థివ దేహం సోమవారం పాట్నా విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయానికి చేరిన వెంటనే భద్రతా సిబ్బంది గౌరవ వందనం సమర్పించి అంతిమ సంస్కారాల నిమిత్తం సారణ్ జిల్లాలోని ఇమ్తియాజ్ స్వగ్రామం నారాయణ్‌పూర్‌కు ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న వారిలో బీఎస్ఎఫ్ అధికారులకే కాకుండా.. రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు.

‘దేశం కోసం ప్రాణత్యాగం చేశారు..’

తండ్రి మృతదేహాన్ని చూసి మొహమ్మద్ ఇమ్తియాజ్ (Mohammed Imtiaz) కొడుకు ఇమ్రాన్ రజా కన్నీరు పెట్టుకున్నాడు. ‘‘నాన్న ఎంతో ధైర్యసాహసాలు గల వ్యక్తి. చివరిసారిగా మే 10న ఉదయం 5.30 గంటలకు ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన కుడికాలికి గాయమైంది. అయినా క్రమశిక్షణతో విధులు నిర్వహించారు. నాన్న నాకు గర్వకారణం. దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారందరికీ నా వందనం. ‘‘భారత్‌పై దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలి. మరొకరి తండ్రి ఇలా ప్రాణాలు కోల్పోకూడదు, ’’ అని మీడియాతో అన్నారు.

‘‘వీరజవాన్ల సేవలను ఎన్నటికి మరువం’’

ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘జమ్మూకశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా సరిహద్దులో పాక్ బదులగాలకు బదులిస్తూ ఇమ్తియాజ్ అమరుడయ్యారు. ఇలాంటి వీరుల త్యాగాల వల్లే మనం నేడు సురక్షితంగా ఉన్నాం. దేశం ఎప్పటికీ వీరి సేవలను మరిచిపోదు’’ అని తేజస్వీ యాదవ్ అన్నారు.

‘‘ఇమ్తియాజ్ త్యాగం వ్యర్థం కాదు’’

బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మోహమ్మద్ ఇమ్తియాజ్ త్యాగం వృథా కాలేదు. మన సైనికులు అతని త్యాగానికి ప్రతీకారం తీర్చారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాన్ని దేశం సగర్వంగా స్మరిస్తుంది’’ అని మంత్రి శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.

Read More
Next Story