చెన్నై.. చిన్నాభిన్నం

చెన్నై నగరం సముద్రాన్ని తలపిస్తోంది. మిచాంగ్‌ ప్రభావంతో చెన్నై నగరం అతలాకుతలమైంది.


చెన్నై.. చిన్నాభిన్నం
x
చెన్నైలో భారీగా వచ్చిన వరద నీటిలో ప్రజలు

చెన్నై నగరం సముద్రాన్ని తలపిస్తోంది. మిచాంగ్‌ ప్రభావంతో చెన్నై నగరం అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. వీధులు నదుల్ని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాకపోకలు నిలిచాయి. విమానాలు ఆగాయి. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. రోడ్లను వరద ముంచెత్తాయి. వర్షాలకు చెన్నైలో ఐదుగురు మరణించారు. వేలాది మంది నిర్వాసితులై చెన్నై, శివార్లలో వందలాది శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. 47 ఏళ్ల తర్వాత చెన్నైలో అత్యధిక వర్షపాతం నమోదైంది.

సముద్రాన్ని తలపిస్తున్న చెన్నై...
తమిళనాడు రాజధాని చెన్నై సముద్రాన్ని తలపించింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మిచాంగ్‌ తుపానుగా మారి తమిళనాడు రాజధానితో పాటు శివారు జిల్లాల్లో జల ప్రళయమే సష్టించింది. గత 48 గంటలుగా ఎడతెరిపి లేకుండా కుంభవష్టి కొనసాగింది. నిన్న అర్థరాత్రి వరకు చెన్నై, శివారు జిల్లాల్లో 35 సెంటీమీటర్ల వర్షం నమోదైంది! దాంతో వీధులన్నీ నదుల్ని తలపిస్తున్నాయి.
ఎటుచూసినా వరదే...
చెన్నైలో ఎటు చూసినా వరద పోటెత్తింది. ఇళ్లు, పార్కింగ్‌ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి! నడుం లోతుకు పైగా నీరు చేరడంతో నగరంలోని అన్ని హైవేలను, సబ్‌వేలను మూసేశారు. రన్‌ వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని ఇవాళ మూసేస్తున్నట్టు ప్రకటించారు. 160 విమాన సేవలు రద్దయ్యాయి. వండలూరు జూలోకి వరదనీరు పోటెత్తడంతో పెద్ద సంఖ్యలో మొసళ్లు తప్పించుకున్నాయి.
కుంగిన పోయెస్‌ గార్డెన్‌ హైవే
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వంటి ప్రముఖులుండే పోయెస్‌ గార్డెన్‌ హైవే 7 అడుగుల మేర కుంగింది! అక్కడ టాన్స్‌ఫార్మర్లు, వాహనాలు అందులో పడిపోయాయి. వాన బీభత్సం కొనసాగుతుండటంతో సహాయ చర్యలూ చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రజలంతా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటున్నారు.
స్తంభించిన రాకపోకలు
చెన్నై శివారులోని జాతీయ రహదారి వరద నీటిలో మునగడంతో రాకపోకలు స్తంభించాయి. నగరం, శివార్లలోని చెరువులు, రిజర్వాయర్లు నిండడంతో అడయార్, కూవం నదులు, బకింగ్‌ హాం కాలువల ద్వారా చెన్నై వైపుగా వరద నీరు ఉధతంగా ప్రవహిస్తోంది.
స్కూళ్లకు సెలవులు
చెన్నై నగరాన్ని చుట్టుముడుతున్న వరద ముప్పును నివారించేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో ఇవాళ కూడా స్కూళ్లకు, ఆఫీసులకు సెలవులు ఇచ్చారు.
47 ఏళ్లలో ఇదే అత్యధిక వాన
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. 47 ఏళ్లలో అత్యంత భారీ వర్షం నమోదు కావడం ఇదే తొలిసారి. 2015 నాటి కుంభవష్టిని కూడా మించిపోయింది.


Next Story