అయోధ్య రామ మందిర ప్రధాన అర్చకుడు కన్నుమూత
x

అయోధ్యలో రామ మందిర ప్రధాన అర్చకుడు ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ శనివారం ఉదయం కన్నుమూశారు.

అయోధ్యలో రామ మందిర ప్రధాన అర్చకుడు ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ శనివారం ఉదయం కన్నుమూశారు. 86 ఏళ్ల దీక్షిత్‌కు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మణికర్ణిక ఘాట్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో జనవరి 22న అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. వారణాసిలోని సీనియర్ పండితులలో దీక్షిత్ ఒకరు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందిన దీక్షిత్ కుటుంబం అనేక తరాలుగా వారణాసిలో నివసిస్తోంది.
లక్ష్మీకాంత్ వారణాసిలోని సంగ్వేద కళాశాలలో సీనియర్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈ కళాశాలను కాశీ రాజు స్థాపించారు. లక్ష్మీకాంత్‌ దీక్షిత్ ప్రముఖ యజుర్వేద పండితులలో ఒకనిగా పేరుగాంచారు. హిందువులు ఆచరించే పూజా విధానాలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. తన మేనమామ గణేష్ దీక్షిత్ దగ్గర లక్ష్మీకాంత్ వేదాలు అభ్యసించారు.
దీక్షిత్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు.
"కాశీ మహా పండితుడు, శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ ప్రధాన అర్చకుడైన ఆచార్య శ్రీ లక్ష్మీకాంత దీక్షిత్ నిష్క్రమణ ఆధ్యాత్మిక, సాహిత్య ప్రపంచానికి తీరని లోటు.సంస్కృత భాష, భారతీయ సంస్కృతికి ఆయన చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని ఆదిత్యనాథ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
‘‘తన పాదాల చెంత ఆచార్య దీక్షిత్ ఆత్మకు చోటు కల్పించాలని, ఆయన శిష్యులకు, అనుచరులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

శనివారం ఉదయం కన్నుమూశారు. 86 ఏళ్ల దీక్షిత్‌కు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మణికర్ణిక ఘాట్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో జనవరి 22న అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. వారణాసిలోని సీనియర్ పండితులలో దీక్షిత్ ఒకరు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందిన దీక్షిత్ కుటుంబం అనేక తరాలుగా వారణాసిలో నివసిస్తోంది.

దీక్షిత్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు.

"కాశీ మహా పండితుడు, శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ ప్రధాన అర్చకుడైన ఆచార్య శ్రీ లక్ష్మీకాంత దీక్షిత్ నిష్క్రమణ ఆధ్యాత్మిక, సాహిత్య ప్రపంచానికి తీరని లోటు.సంస్కృత భాష, భారతీయ సంస్కృతికి ఆయన చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని ఆదిత్యనాథ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

‘‘తన పాదాల చెంత ఆచార్య దీక్షిత్ ఆత్మకు చోటు కల్పించాలని, ఆయన శిష్యులకు, అనుచరులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

Read More
Next Story