సివిల్స్: తప్పులు సరిదిద్దుకుని.. విజేతలుగా నిలిచారు
x

సివిల్స్: తప్పులు సరిదిద్దుకుని.. విజేతలుగా నిలిచారు

గడచిన తప్పులు సరిదిద్దుకుని సివిల్స్ లో విజేతలుగా నిలిచారు ఆదిత్య శ్రీవాస్తవ. సబ్జెక్ట్ లో ఎక్కడ తప్పులు ఉన్నాయో..


ఆదిత్య శ్రీ వాస్తవ.. తాజాగా ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా నంబర్ వన్ ర్యాంక్ సాధించారు. ఇంతకుముందు సివిల్స్ రాస్తే ఆలిండియా లెవెల్లో 236 ర్యాంకు వచ్చింది దాంతో అసంతృప్తికి గురైన ఆదిత్య మరోమారు సివిల్స్ రాసి మొదటి ర్యాంకు సాధించారు. ఇందుకోసం ఆయన అనుసరించిన వ్యూహం ఒకటే.. గడిచిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రిపరేషన్ సాగించి విజేతగా నిలిచారు.

" నా ప్రిపరేషన్ లో ఒకే అంశం గురించి ఆలోచించాను. నా స్కోరు తగ్గడానికి కారణాలు ఏంటీ.. ఏ తప్పుల వల్ల మార్కులు తగ్గుతున్నాయి. వాటిని గుర్తించి సవరించుకున్నాను " అని 26 ఏళ్ల ఈ ఐఐటీ - కాన్పూర్ గ్రాడ్యుయెట్ అన్నారు.
"నేను నా ఫ్రెండ్స్ ను కలిశాను. ఈ సబ్జెక్ట్ ల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారితో మాట్లాడాను. నా తప్పులు ఎక్కడ జరగుతున్నాయో తెలుసుకున్నాను. " అని ఆదిత్య శ్రీవాస్తవ అన్నారు.
మరో సివిల్స్ ర్యాంకర్ అయాన్ జైన్ తను చివరగా రాసిన సివిల్స్ ఫలితాల్లో 87 వ ర్యాంకు సాధించగా .. తాజా గా ప్రకటించిన ఫలితాల్లో 16 వ ర్యాంకు సాధించాడు. తన విజయాలను కారణం.. గడిచిన సంవత్సరాల సివిల్స్ ప్రశ్నపత్రాలను కూలంకషంగా అధ్యయనం చేయడమే కారణం అన్నారు. అందువల్లే ఈ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. భోపాల్ కు చెందిన అయాన్.. ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యూయేట్ పూర్తి చేశారు.
నాగపూర్ కు చెందిన సమీర్ ఖోండే చివరగా రాసిన సివిల్స్ ఫలితాల్లో 551 ర్యాంకు సాధించారు. అయితే ప్రస్తుతం అలిండియా లెవెల్లో 42 వ ర్యాంకు సాధించాడు. " నా ఆప్షనల్స్ పేపర్ లో ఎక్కువగా నా సొంత అభిప్రాయాలపై హార్డ్ వర్క్ చేశాను. సిద్దాంతాలను కోట్ చేయకుండా.. ఎక్కువగా డేటా ను సమగ్రంగా వివరించాను" అని వివరించారు. సమీర్ ఐఐఎం లక్నో గ్రాడ్యూయేట్.
Read More
Next Story