ఈ సారి కూడా ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు నిరాశే ..
x

ఈ సారి కూడా ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు నిరాశే ..

లిక్కర్ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది.


లిక్కర్ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం జూలై 3 వరకు పొడిగించింది.

గతంలో కేజ్రీవాల్‌కు మంజూరైన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచగా ప్రత్యేక న్యాయమూర్తి నియాయ్ బిందు కస్టడీని పొడిగించారు.

విచారణ సందర్భంగా..కస్టడీని పొడిగించాలని ED కోరడాన్ని తప్పుబట్టారు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది. కస్టడీ పొడిగింపునకు ఆధారాలు లేవని వాదించారు. తీవ్రమైన ఆర్థిక నేరాలతో కేజ్రీవాల్‌కు సంబంధాలున్నాయని, వాటికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఈడీ వాదించడంతో కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

మద్యం కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్టు చేశారు. లోక్‌సభ ఎన్నికలలో ప్రచారం కోసం మే 10న సుప్రీంకోర్టు ఆయనకు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికలు జూన్ 1తో ముగుస్తాయి. ఆ తర్వాత రోజు (జూన్ 2న ) కేజ్రీవాల్ లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని వైద్య పరీక్షలు చేయించేందుకు మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని పిటీషన్ వేశారు. తన క్లయింట్ అకస్మాత్తుగా బరువు తగ్గడం, శరీరంలో కీటోన్ లెవల్స్ పెరగడంతో వైద్య పరీక్షలు చేయించాల్సి ఉందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదించారు. అయినా బెయిల్ లభించలేదు.

Read More
Next Story