‘పీఎం గారూ..జోక్యం చేసుకోండి’
x

‘పీఎం గారూ..జోక్యం చేసుకోండి’

‘కచ్చతీవు’ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రధాని మోదీని కోరిన తమిళనాడు సీఎం స్టాలిన్..


Click the Play button to hear this message in audio format

శ్రీలంక(Sri Lanka) ఆధీనంలోని కట్చతీవు ద్వీపంపై ఉన్న దీర్ఘకాల వివాదాన్ని పరిష్కరించడానికి ప్రధాని మోదీ(PM Modi) జోక్యం చేసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) కోరారు. చేపల వేటకు వెళ్లి శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న భారత మత్స్యకారులను విడుదల చేయించడంతో పాటు శ్రీలంక నావికాదళం స్వాధీనం చేసుకున్న మత్స్యకారుల పడవలను తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

మైలాడుతురై జిల్లాలో ఓ బహిరంగ సభ వేదికగా స్టాలిన్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. దశాబ్ద కాలంగా తమిళనాడు మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడటంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోగా.. రాజకీయం చేయడం తగదన్నారు.

కచ్చతీవు ద్వీపాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేదిలేదని శ్రీలంక మత్స్యకార మంత్రి డగ్లస్ దేవానంద వ్యాఖ్యలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కట్చతీవును తిరిగే అప్పగించాలని తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని స్టాలిన్ గుర్తుచేశారు.


బీజేపీ కౌంటర్..

ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు బీజేపీ ప్రతినిధి నారాయణ్ తిరుపతి కౌంటర్ ఇచ్చారు. 1974లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు..అదే సమయంలో తమిళనాడులో డీఎంకే పవర్‌లో ఉన్నపుడు కచ్చతీవును శ్రీలంకకు అప్పగించారని గుర్తుచేశారు. గతంలో 14 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన డీఎంకే(DMK) అప్పట్లో నోరు మెదపకుండా ఉండి.. ఇప్పుడు సమస్యను పరిష్కరించాలని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భారత మత్స్యకారులపై శ్రీలంక నావికాదళం కాల్పులు జరపకుండా కేంద్ర ప్రభుత్వం నిలువరించిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో దాదాపు 1000 మంది మత్స్యకారులు చనిపోగా...కేంద్రంలోని ఎన్డీఏ మరణశిక్ష నుంచి మత్స్యకారులను కాపాడిందని చెప్పారు.

Read More
Next Story