మోదీపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
x

మోదీపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కాంగ్రెస్, డీఎంకే పార్టీలు తోడయ్యాయి. ప్రధాని మోదీపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అందులో ఏమని పేర్కొన్నారు?


లోక్‌సభ ఏడో ధపా ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ రోజు సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు తమిళనాడులోని కన్యాకుమారిలో ఉండబోతున్నారు. అక్కడ స్వామి వివేకానందుడికి నివాళి అర్పించిన అనంతరం రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఇప్పటికే మమత..
ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ధ్యానం విజువల్స్ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆ విజువల్స్ టీవీల్లో ప్రసారం కాకుండా చూడాలని ఈసీని కోరతానని ఆమె చెప్పారు. ఇదే విషయాన్ని తాము కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ చెప్పారు.
మోడీ ధ్యానాన్ని జూన్ 1న విరమిస్తారు. అదే రోజున ఉత్తరప్రదేశ్‌లోని ఆయన సొంత లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో ఓటు వేస్తారు.
అనుమతి ఇవ్వకండి..
ప్రధాని పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని కాంగ్రెస్‌తో పాటు తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజ్గం (DMK) నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆయన రాకతో పర్యాటకులు ఇబ్బందిపడే అవకాశం ఉందన్నారు. మోదీ కన్యాకుమారి రానుండడంతో ఇప్పటికే అక్కడ 2,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.
పర్యాటకులకు ఇబ్బంది..
మోదీ పర్యటనతో అటు పర్యాటకులు, అక్కడ వ్యాపారం చేసుకుంటున్న చిరువ్యాపారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని డిఎంకె కన్యాకుమారి దక్షిణ జిల్లా న్యాయవాదుల విభాగం ఆర్గనైజర్ ఎం జోసెఫ్ రాజ్ కన్యాకుమారి పేర్కొన్నారు. ఆ కార్యక్రమానికి అనుమతించరాదని కలెక్టర్ కమ్ రిటర్నింగ్ అధికారి పిఎన్ శ్రీధర్‌ను కోరారు.
మోదీ ధ్యానం విజువల్స్ మీడియాలో నాన్‌స్టాప్‌గా చూయించడం వల్ల ఓటర్లపై ప్రభావం పడుతుందన్నారు సీపీఐ(ఎం) తమిళనాడు కార్యదర్శి కె బాలకృష్ణన్. ఈ విషయంపై ప్రధాన ఎన్నికల కమీషనర్‌కు లేఖ కూడా రాశారు
Read More
Next Story