
రాజ్యాంగ దినోత్సవం: దేశపౌరులకు మోదీ లేఖ సారాంశం ఏమిటి?
ఏటా నవంబర్ 26ను పాఠశాలలు, కళాశాలల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని కోరిన ప్రధాని
దేశపౌరుల నడవడిక బలమైన ప్రజాస్వామ్యానికి పునాది అని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పౌరులకు రాసిన లేఖలో ఆయన పలు విషయాలకు ప్రస్తావించారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం బలపడుతుందని, బలోపేతం ప్రజాస్వామ్య బాధ్యత ప్రతి ఓటరుపై ఉందని గుర్తుచేశారు. ప్రతి ఏటా పాఠశాలలు, కళాశాలల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution day) నిర్వహించాలని కోరారు.
On Constitution Day, wrote a letter to my fellow citizens in which I’ve highlighted about the greatness of our Constitution, the importance of Fundamental Duties in our lives, why we should celebrate becoming a first time voter and more…https://t.co/i6nQAfeGyu
— Narendra Modi (@narendramodi) November 26, 2025
‘‘గౌరవం, సమానత్వం, స్వేచ్ఛకు ప్రాధాన్యం..’’
నేడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలకు దోహదం చేస్తాయని చెబుతూ.. "మన రాజ్యాంగం పౌరుల గౌరవం, సమానత్వం, స్వేచ్ఛకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంది. మనకు హక్కులను కల్పిస్తూనే.. పౌరులుగా మన విధులను కూడా గుర్తు చేస్తుంది." అని ట్వీట్ చేశారు.
మోడీ లేఖ సారాంశం..
"నవంబర్ 26..ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు. 1949లో ఇదే రోజున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. దేశ పురోగతికి మార్గనిర్దేశం చేసే పవిత్ర గ్రంథం రాజ్యాంగం. అందుకే 2015లో NDA ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది. సామాన్య, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన నన్ను 24 సంవత్సరాలకుపైగా ప్రజలకు సేవ చేయగలిగేలా చేసింది మన రాజ్యాంగమే. 2014లో నేను తొలిసారి పార్లమెంటుకు వచ్చా. గొప్ప దేవాలయం మెట్లను తాకి నమస్కరించిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మళ్ళీ 2019లో ఎన్నికల ఫలితాల తర్వాత.. నేను సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లోకి ప్రవేశించినప్పుడు నా నుదిటిపై రాజ్యాంగాన్ని ఉంచుకున్నాను. నాలాగా కలలు కనే అనేకమందికి రాజ్యాంగమే స్ఫూర్తి.’’ అని పేర్కొన్నారు.

