
S.I.Rపై చర్చకు డేట్ ఫిక్స్..
తక్షణమే చర్చించాలని రాజ్యసభలో ప్రతిపక్షాల డిమాండ్..
పార్లమెంటు(Parliament) శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయిన విషయం తెలిసిందే. అయితే పలు అంశాలపై చర్చ జరగాలని, మరీ ముఖ్యంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (S.I.R)పై తక్షణం చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఇదే విషయంపై గత రెండు రోజులుగా అటు లోక్‌సభ (Loksabha)లో, ఇటు రాజ్యసభ(Rajyasabha) లో గందరగోళం నెలకొంది. చివరకు ప్రభుత్వం అంగీకరించడంతో లోక్‌సభ స్పీకర్ డిసెంబర్ 9ని ఖరారు చేశారు.
దీంతో మూడో రోజు ముందు ప్రతిపక్ష ఇండియా బ్లాక్ ఫ్లోర్ లీడర్లు సమావేశమయ్యారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. S.I.R పై ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్నలు, రాబట్టాల్సిన సమాధానాలపై లోతుగా చర్చించారు.
ఇటు రాజ్యసభలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్‌పై తక్షణమే చర్చించాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ప్రభుత్వం అలాంటి చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు పునరుద్ఘాటించారు. చర్చకు ఒక నిర్ణీత తేదీ కూడా ప్రకటించకపోవడంతో గందరగోళం నెలకొంది.

