
ప్యూయల్ బ్యాన్‌పై సుప్రీంకోర్టుకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా..
కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్యూయల్ బ్యాన్ సాధ్యం కాదని CAQM చైర్మన్ రాజేష్ వర్మకు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా లేఖ ..
ఢిల్లీ(Delhi)లో 15 సంవత్సరాలు పూర్తయిన పెట్రోల్ వాహనాలకు, పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలపై ఇంధన నిషేధం(Fuel Ban) జూలై 1 నుంచి అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో నిర్ణయాన్ని పునరాలోచించాలని ఢిల్లీ ప్రభుత్వం సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ ప్యానెల్‌ను కోరింది. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్యూయల్ బ్యాన్ సాధ్యం కాదని ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) చైర్మన్ రాజేష్ వర్మకు లేఖ కూడా రాశారు.
‘ప్రజల మనోభావాలను కోర్టు ముందుంచుతాం..’
"ప్రభుత్వం తీసుకున్న కాలుష్య నియంత్రణ చర్యల గురించి మేం సుప్రీంకోర్టుకు చెబుతాం. దేశవ్యాప్తంగా వర్తించే షరతులు ఢిల్లీకి కూడా వర్తిస్తాయి. ఢిల్లీ వాసులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకూడదని మేం కోరుకుంటున్నాం.’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ముందు ప్రజల మనోభావాలను ప్రభుత్వం కోర్టు ముందుంచుతుందని ఆమె చెప్పారు.
2018లో సుప్రీంకోర్టు తీర్పు ఢిల్లీలో 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలను మరియు 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలను నిషేధించింది. 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ చేయకూడదని చెబుతోంది.