
‘ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని 5 శాతానికి ఎందుకు తగ్గించలేరు’
కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు ..
దేశ రాజధాని ఢిల్లీ(Delhi), పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత(AQI) క్షీణిస్తోన్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని సూటిగా ఒక ప్రశ్న అడిగింది. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఎయిర్ ప్యూరిఫైయర్ల(Purifiers)పై జీఎస్టీ(GST)ని 18% నుంచి 5%కి ఎందుకు తగ్గించకూడదని ప్రశ్నించింది. వైద్య పరికరాలపై ఐదు శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నట్లుగానే ఎయిర్ ప్యూరిఫైయర్లను కూడా అంతే జీఎస్టీ వసూల చేయాలని ఓ పిటిషనర్ వేసిన దావాపై కోర్టు స్పందించింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఎయిర్ కండిషన్ నానాటికీ దిగజారుతున్నందున ఎయిర్ ప్యూరిఫైయర్లపై ఐదు శాతం వసూలు చేసేలా అధికారులను ఆదేశించాలని ఆయన కోరారు. గాలి నాణ్యత సూచిక (AQI) 'చాలా పేలవంగా' ఉన్నా కూడా ఎయిర్ ప్యూరిఫైయర్లపై పన్నులను మినహాయింపు ఇవ్వడానికి అధికారులు ఏమీ చేయకపోవడంపై హైకోర్టు గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద ఫిబ్రవరి 2020లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎయిర్ ప్యూరిఫైయర్లు వైద్య పరికరాలుగా అర్హత పొందుతాయనే పిటిషనర్ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
జీఎస్‌టీ రేట్ల నిర్ణయం జీఎస్‌టీ కౌన్సిల్ పరిధిలో ఉంటుందని కేంద్రం కేంద్రం తరపున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకటరామన్ కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ కాలుష్య పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని కోర్టు స్పష్టంగా సూచించింది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని కోర్టు కేంద్రానికి పది రోజుల గడువు ఇచ్చింది.

