
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు..
రంగంలోకి బాంబ్ డిస్పోసబుల్ స్వ్కాడ్..
ఢిల్లీ (Delhi) హైకోర్టు(High court)కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. రిజిస్ట్రార్ జనరల్‌కు ఈ రోజు(సెప్టెంబర్ 12వ తేదీ) ఉదయం 8.39 గంటలకు మెయిల్ రావడంతో అప్రమత్తమయిన కోర్టు సిబ్బంది..వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పారు. కాసేపటికే కోర్టు వద్దకు చేరుకున్న బాంబ్ డిస్పోసబుల్ స్వ్కాడ్.. భవనాన్ని ఖాళీ చేయించి తనిఖీ చేసింది. కోర్టు భవనాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఎలాంటి బాంబులు లేవని న్యూఢిల్లీ డీసీపీ దేవేష్ కుమార్ మహలా చెప్పారు.
‘న్యాయమూర్తుల గదులు/కోర్టు కాంప్లెక్స్‌లోమూడు బాంబులు ఉంచారు. మధ్యాహ్నం 2 గంటలలోపు భవనాలను ఖాళీ చేయాలి. లేకపోతే అవి పేలిపోతాయి’ అని రాసి ఉన్న ఈ-మెయిల్‌తో ఒక్కసారిగా కోర్టు సిబ్బందిలో ఆందోళన మొదలైంది. చివరకు అలాంటిదేమీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Next Story