లోక్ సభ: బీజేపీని ప్రతిపక్ష నేతగా రాహుల్ వణికించారా?
x

లోక్ సభ: బీజేపీని ప్రతిపక్ష నేతగా రాహుల్ వణికించారా?

లోక్ సభ లో రాహూల్ గాంధీ సోమవారం సాధికారికంగా మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ ప్రతిపక్షాలను ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.


ఒక దశాబ్దం కి పైగా లోక్ సభలో మెజారిటీతో ప్రతిపక్షాలను బుల్డోజ్ చేసిన బీజేపీకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సీట్లు రాలేదు. అయితే సోమవారం రాష్ట్రపతి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే అంశం పై లోక్ సభలో రాహూల్ ప్రసంగించారు. తన ప్రసంగంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ పై నేరుగా విమర్శలు గుప్పించారు. ఒక గంటకు పైగా సాగిన ఆయన ప్రసంగంలో పోరాట పటిమ, లోతైన రాజకీయం, కొంచెం అసంబద్ధం కనిపించాయి. ప్రస్తుత లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాత వైఖరితో వ్యవహరించడాన్ని కూడా సభలోనే ప్రస్తావించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 26న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వివరించిన ప్రభుత్వ దార్శనికతను తిప్పికొట్టేందుకు రాహుల్ తన తొలి ప్రసంగం కోసం హార్డ్ డేటా, గణాంకాలను మాత్రం ఎక్కడా ఉదహరించిన దాఖలా కనిపించలేదు. హిందూమతంపై పూర్తి స్థాయి హక్కులు క్లెయిమ్ చేసుకుంటున్న తరుణంలో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం మాత్రమే రాహూల్ ప్రసంగంలో ప్రధానంగా కనిపించింది.
పరమ శివుడి పోస్టర్ ను తెలివిగా వాడుకున్న రాహూల్..
లోక్ సభ లో స్పీకర్, బీజేపీ పదేపదే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ రాహూల్ గాంధీ మాత్రం గాడ్ పరమ శివుడు ఫొటోను లోక్ సభ లో పదే పదే చూపాడు. ఇలా చూపడం ద్వారా హిందూత్వ, కాషాయ వాతావరణాన్ని భవిష్యత్ లో బీజేపీ ఉపయోగించుకోవద్దనే ఉద్దేశం ఆయన ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది. అయితే ఇలా లోక్ సభ లో దేవుడి ఫొటోలను చూపడం ద్వారా నిజమైన లౌకిక వాదులు ఎలా తీసుకుంటారో చూడాలి.
రాహుల్ తన ప్రసంగంలో శివుడిని ప్రశాంతత, సహనం, ధైర్యానికి చిహ్నంగా అభివర్ణించారు. అభయ్ ముద్ర (శివుడి కుడి అరచేతి నిటారుగా నిటారుగా ఉంచి, భరోసా ఇచ్చే సంజ్ఞ, కాంగ్రెస్ ఎన్నికల గుర్తు చాలా పోలి ఉంటుంది) గురించి పదే పదే మాట్లాడుతూ, హిందూ దేవుళ్లు సూచించే ధర్మాలకు, బీజేపీ ఆచరించి, ప్రచారం చేస్తున్న హిందుత్వం విరుద్దంగా ఉందని చెప్పాడు. హిందూమతం అన్ని ఇతర విశ్వాసాల్లాగా శాంతి, సహనం, నిర్భయత, అహింసను బోధిస్తున్నాయని నొక్కిచెప్పిన రాహుల్, వారి(బీజేపీ) హిందూ మతం "హింసను మాత్రమే" అని భోదిస్తుందని అన్నారు.
రాహూల్ ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ రెండు సార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014 లోక్ సభ ఎన్నికల తరువాత ఇలా తొలిసారి జరిగింది. ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నప్పుడు అధికార పక్షం ప్రసంగం ఆపాలని నిరసన వ్యక్తం చేశాయి. హిందూ మతానికి మోదీ సంరక్షకుడు కాడని, ఆర్ఎస్ఎస్ ప్రకటించిన హిందూమతానికి మాత్రమే రక్షకుడని అన్నారు. ఇది హింసను ప్రభోదిస్తుందని విమర్శించారు.
రాహుల్ ప్రసంగం చివరి భాగం రాష్ట్రపతి ప్రసంగాన్ని తిప్పికొట్టేలా ఉంది. తృణమూల్‌కు చెందిన మహువా మోయిత్రా లేదా డిఎంకెకు చెందిన ఎ రాజా లాగా రాష్ట్రపతి ప్రసంగంలోని సూక్ష్మ అంశాల జోలికి రాహూల్ గాంధీ వెళ్లలేదు కానీ వివిధ వర్గాల జనాభా - రైతులు, మహిళలు, యువత, సాయుధ దళాల ఆకాంక్షలు, చిన్న, మధ్య తరహా సవాళ్ల గురించి ఆయన తీవ్రంగా మాట్లాడారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల వ్యాపారస్తులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు రాహూల్ లోక్ సభ లో ప్రస్తావించారు. రాహూల్ తన ప్రసంగంలో పదేపదే మోదీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రాహూల్ గాంధీ నేరుగా ఆకాశంలో నుంచి ఊడిపడ్డాడని వ్యంగ్యంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి అదానీ, అంబానీల ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తుందని ఆయన ఎదురుదాడికి దిగారు.
బీజేపీని గడగడలాడించారు..
తను ప్రసంగం చేస్తున్నంత సేపు సాధికారికంగా కనిపించారు. ప్రధాని మోదీ రెండు సార్లు, అమిత్ షా మూడుసార్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆయన వ్యాఖ్యలపై స్పీకర్ ను కలగజేసుకోవాల్సిందిగా బీజేపీ అగ్రనాయకులు కోరడం ద్వారా బీజేపీని రాహూల్ ప్రసంగం ఎంతటా వణికించిందో అర్థం చేసుకోవచ్చు.
కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేంద్ర యాదవ్, కిరెన్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్‌వాల్ వంటి నాయకులు రాహూల్ ప్రసంగం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ గాంధీ ఎక్కడా తగ్గలేదు. గత దశాబ్ధ కాలంలో దేశాన్ని ద్వేషం, భయంలో ముంచెత్తాడని ఆరోపించారు. వ్యవస్థలన్నీ మోదీ కూలదోస్తున్నారని, ఆర్మీలో తీసుకొచ్చిన అగ్నివీర్, రైతు చట్టాలు, శ్రామికులు ఇలా అందరిని కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాహూల్ ప్రసంగం ప్రతిపక్ష పార్టీలకు ఉత్తేజం వచ్చిందనే చెప్పాలి. గత దశాబ్ద కాలంలో మోదీ సర్కార్ ఏకపక్షంగా విపక్షాలను బుల్ డోజ్ చేసింది. చాలా సార్లు ఎగతాళి చేసింది. ఇప్పుడు రాహూల్ ఇచ్చిన బూస్ట్ తో 230 కి పైగా ఎంపీలు ఉన్న ఇండి కూటమి ఇక మౌనంగా ఉండే పరిస్థితి లేదు.
మిత్రపక్షాలు ఒక్కతాటిపై..
ప్రధానమంత్రిని టార్గెట్ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ప్రతిపక్షాలను కూడగట్టిన తీరును చూస్తే రాహూల్ స్థాయి పెరిగినట్లు కనిపిస్తోంది. రాహూల్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ఎంపీలు ప్రయత్నించినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలతో జత కలిశారు. ఇతర పార్టీల ఎంపీలు కూడా ఇక్కడ జతకూడటం గమనార్హం. తొలి ప్రసంగం ద్వారా రాహూల్ బలమైన ఉనికిని నమోదు చేసుకున్నారు. కానీ డేటాను ఉపయోగించి రాజకీయంగా ఇంకాస్త హిందూత్వ అంశాలను ప్రస్తావిస్తే బాగుండేది.
రాహుల్ తర్వాత పరిస్థితేంటి..
అలాగే, గత దశాబ్ద కాలంగా ప్రతిపక్షం తరఫున కేవలం ఒక ఎంపీగా ఉన్న రాహూల్ గాంధీ ఎప్పుడో ఒకసారి సభకు రావడం, తన వంతు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడటం వంటివి మాత్రమే కనిపించాయి. ఇతర ఎంపీలు మాట్లాడే ప్రసంగాలను వినకపోవడం జరిగేది. అయితే ఇప్పుడు లోక్ సభ లో ప్రతిపక్ష నేతగా కచ్చితంగా సభకు రావాల్సి ఉంటుంది. ఇందుకోసం రాజకీయ పరిణత అవసరం. తన ప్రసంగం ముగిసిన తరువాత సభ నుంచి వాకౌట్ చేయడం ద్వారా రాజకీయ పరిపక్వతను ప్రదర్శించారు.
ఏది ఏమైనప్పటికీ, సోమవారం నాటి లోక్‌సభ కార్యక్రమాలలో స్పష్టంగా కనిపించిన విషయం ఏమిటంటే, మోదీ ప్రభుత్వం తన మూడవ టర్మ్‌లో గందరగోళంగా ఉంది. గత పది సంవత్సరాలుగా కోల్పోయిన తన స్వరాన్ని ఇప్పుడు కనుగొంది. అలాగే ఓ నాయకుడు కూడా దొరికాడు.
Read More
Next Story