ప్రజాస్వామ్యం ఓ పదం.. ఓటు సంబరాలకది వేదం. రాజకీయం అంటే మోసమని చాలా మంది అంటుంటారు. కానీ అది నిజం కాదు. రాజకీయాలు రకరకాలు, రాజకీయంలో జెండర్ పాలిటిక్స్, జెన్యూన్ పాలిటిక్స్, పీపుల్స్ పాలిటిక్స్, జెనెటికల్ పాలిటిక్స్, డెవలప్‌మెంటల్ పాలిటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ పాలిటిక్స్, డెమొక్రటిక్ పాలిటిక్స్ ఉంటాయి. పొద్దు పొడిచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు వరకు మనం రకరకాల రాజకీయాలను చూస్తుంటాం వాటిల్లోకి కొత్తగా వచ్చి చేరిందే డైవర్షన్ పాలిటిక్స్.
ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నేతలు ఎవరి స్ట్రాటజీలో వారు ఉన్నారు. అనుకున్న రీతిలో విజయాన్ని సాధించాలంటే స్ట్రాటజీలు తప్పనిసరని భావిస్తున్నారు. అందుకే వ్యూహకర్తలకు డిమాండ్ పెరిగింది. ఒకే వ్యూహకర్త గత ఎన్నికల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ట్రాటజీ చెబితే, వచ్చే ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యూహరచన చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రతిపక్షాలను అయోమయంలోకి తీసుకెళ్లే వ్యూహం
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన వ్యూహాన్ని అమలు చేస్తూ ప్రతిపక్షాలను అయోమయంలోకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. జగన్ ఇప్పటికే 11 నియోజకవర్గాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్తగా ఇన్‌చార్జ్‌లను ప్రకటించారు. ఆ తర్వాత పలు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను ప్రకటించడంలో చాలా గ్యాప్ తీసుకున్నారు. కారణాలు ఏవైనా మిగిలిన వారి నుంచి అసంతృప్తి రాకుండా చూసుకునే స్ట్రాటజీలో ఇది ఒక భాగంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం అనంతపురం, గోదావరి జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. కదిరి నియోజకవర్గం నుంచి పి సిద్దారెడ్డి, కల్యాణదుర్గం నుంచి ఉష శ్రీచరణ్, రాయదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి, పెనుగొండ నుంచి ఎం శంకర్‌నారాయణ, మడకశిర నుంచి తిప్పేస్వామి సీఎంను కలిశారు. టీడీపీ అభ్యర్థులు ఎవరు? వారి ఎంపిక ఎలా జరగుతున్నది. సర్వేలు చేసి రిపోర్టులు ఇచ్చిన సంస్థలు ఏమేమిటివి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సీఎం తెలుసుకుంటూనే ఉన్నారు.
టీడీపీ కూడా అభ్యర్థుల ఎంపికలో తలమునకలైంది. ఇప్పటికే వంద మంది అభ్యర్థుల జాబితా రెడీ చేసినట్లు సమాచారం. ఎవరికి వారు అభ్యర్థుల ఎంపికలో బిజీబిజీగా ఉన్నప్పటికీ స్ట్రాటజీలు మాత్రం మానుకోలేదు. స్ట్రాటజిస్టులకు కావాల్సిన పని కల్పిస్తూనే ఉన్నారు.
తెరపైకి ఆడుదాం ఆంధ్ర..
అయితే ఒక వారం రోజులుగా ఆడుదాం ఆంధ్ర తెరపైకి వచ్చింది. రోజా రాజకీయ చతురతే కాకుండా సినిమా వ్యూహాన్ని కూడా ఇందులో చొప్పించారని చెప్పవచ్చు. గుంటూరులో మంగళవారం ఆడుదాం ఆంధ్ర ఆటలు పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన సందర్భంగా రోజా కాస్త సినిమా ట్రిక్కులు ప్లే చేశారు. అంటే జనం దృష్టిని ఆటల వైపు మరలించేందుకు ఒక వ్యూహం అని చెప్పవచ్చు. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా తయారైనా నిదానంగా వారిని పిలిపించి సీఎం మాట్లాడుతూనే ఉన్నారు. అధినేతతో పాటు మిగిలిన మంత్రులు కూడాఎవరి కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు. ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయాలు చేయడానికి కాదని, ప్రజల మధ్య పనిచేస్తున్నామని చెప్పుకునేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి బ్యాట్ పట్టి క్రికెట్ బాల్ కొడుతుంటే రోజా తప్పట్లు కొట్టడం, రోజా క్రికెట్ బ్యాట్ పట్టుకొని బౌలర్ వేసిన బాల్‌ను కొడుతుంటే సీఎం జగన్ చప్పట్లు కొట్టడం అక్కడ ఉన్న ప్రేక్షకులను ఉత్తేజ పరిచింది. ఈ కార్యక్రమం గుంటూరులో ఒక రోజంతా సాగింది. మరో వారం రోజులు పాటు ఈ కార్యక్రమం కొనసాగే కొనసాగుతుంది.
రాంగోపాల్ వర్మ వ్యూహం ఆలోచించాల్సిందే..
మరో పక్కక వ్యూహం సినిమా వ్యవహారాలు కూడా నేతల మధ్య చర్చకు వస్తున్నాయి. ఈ సినిమాను రిలీజ్‌కాకుండా చేసేందుకు టీడీపీవారు ప్రయతిస్తున్నారు. డైరెక్టర్ రామగోపాల్ వర్మకూడా అందరి దృష్టిని ఆకర్షించేందుకు యత్నిస్తున్నా నావరకు నేను సినిమా తీసాను. తర్వాత జరిగేవి తర్వాత జరుగుతాయని చెబుతున్నారు. ఇది కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం ముందకు సాగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బుధవారం డీజీపీని రామ్‌గోపాల్‌వర్మ కలిసి తనను చంపేందుకు ఒక వ్యక్తి సుపారీ ఇచ్చారని, వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story