రాజకీయాల్లో మరో మాజీ క్రికెటర్, ఎంపీగా పోటీ
x
యూసుఫ్ పఠాన్, మాజీ క్రికెటర్

రాజకీయాల్లో మరో మాజీ క్రికెటర్, ఎంపీగా పోటీ

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ తరఫున ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ప్రకటించాడు. ఆయన తలపండిన ప్రత్యర్థితో పోరాడబోతున్నారు.. ఆయన ఎవరంటే..


భారత మాజీ క్రికెటర్, 2007,2011 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు అయిన యూసుఫ్ పఠాన్ రాజకీయాల్లోకి రానున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఎంసీ తరఫున ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ (బెర్హంపూర్) నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) టికెట్‌పై పఠాన్ పోటీ చేయనున్నారని తెలుస్తోంది. బహరంపూర్ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరితో ఆయన తలపడే అవకాశం ఉంది.
డబుల్ వరల్డ్ కప్ విజేత, 41 ఏళ్ల పఠాన్ 2008 మరియు 2012 మధ్య భారతదేశం తరపున 57 వన్డేలు, 22 T20 లు ఆడాడు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఈ ఆల్‌రౌండర్ 2021లో క్రికెట్‌కు రిటైర్ మెంట్ ప్రకటించాడు.
పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ నియోజకవర్గాలకు టీఎంసీ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. ఇందులో యూసుఫ్ పఠాన్ చోటు దక్కింది. కాగా ఇప్పటికే క్రికెటర్ మహ్మద్ షఫీకి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని ఆఫర్ వచ్చింది. ఇంతకుముందే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎంపీగా ఉన్నాడు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని గంభీర్ ప్రకటించారు.


Read More
Next Story