మా భూభాగాన్ని అభివృద్ది చేసే హక్కు భారత్ కు లేదు: చైనా
x
భారత ప్రధాని నరేంద్ర మోదీ

మా భూభాగాన్ని అభివృద్ది చేసే హక్కు భారత్ కు లేదు: చైనా

భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించడం పై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ భూభాగాన్ని భారత్ ఎలా అభివృద్ధి చేస్తుందని పైత్యాన్ని ప్రదర్శించింది


జిత్తులమారీ చైనా మరోసారి భారత్ పై నోరు పారేసుకుంది. ఇప్పటికే సరిహద్దులోని 16 దేశాలతో కయ్యాలు, దక్షిణ చైనా సముద్రం మొత్తం నాదే అంటూ చిన్న దేశాలపై పెత్తనం, ఫిలిప్ఫైన్స్, తైవాన్ తో గొడవలతో ప్రపంచ వ్యాప్తంగా అభాసుపాలవుతున్నా.. దాని బుద్ది మారడం లేదు.

తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గత వారం భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించినందుకు తన నిరసన తెలియజేసినట్లు వెల్లడైంది. ఈ చర్యల ద్వారా సరిహద్దు సమస్యలను క్లిష్టతరం చేస్తాయని వాదించింది. చైనా అరుణాచల్ ప్రదేశ్ ని టిబెట్ లోని భాగంగా వాదిస్తోంది. తమ భూభాగాన్ని అభివృద్ధి చేయడం ఏంటని తన పైత్యాన్ని ప్రదర్శించింది.

అరుణాచల్ ప్రదేశ్‌లో 13,000 అడుగుల ఎత్తులో నిర్మించిన సెలా టన్నెల్‌ను ప్రధాని మోదీ శనివారం జాతికి అంకితం చేశారు, ఇది వ్యూహాత్మకంగా ఉన్న తవాంగ్‌కు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కనెక్టివిటీని అందిస్తుంది దీనితో పాటు నిరంతరాయంగా సరిహద్దులోని సైన్యానికి అవసరమైన అన్ని సాయాలను అందించగలుగుతుంది.
అస్సాంలోని తేజ్‌పూర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లాను కలిపే దారిలోనే మధ్య లో ఒక రెండు వరుసల టన్నెల్ ను నిర్మించారు. దీనికిగాను ప్రభుత్వం రూ. 825 కోట్లను ఖర్చు చేసింది. సైనిక అధికారుల ప్రకారం, ఎల్ఏసీ లో ఉన్న ఫార్వర్డ్ దళాలకు అవసరమైన ఆయుధాలు, ఇతర మెరుగైన సౌకర్యాలను సెలా టన్నెల్ అందిస్తుంది.
పక్క దేశాల భూభాగాలను తన దేశంలో భాగమని చైనాకు చూపడం మొదటి నుంచి కమ్యూనిస్టు చైనాకు అలవాటే. ఆయా భూభాగాలకు చైనా పేర్ల పెట్టడం కూడా కొత్త కాదు. అలా భారత్ లోని ప్రాంతాలకు చైనా పెట్టిన పేర్లను ప్రభుత్వ ఖండించింది. పేర్ల పెట్టడం వల్ల వాస్తవికతను మార్చలేరని కౌంటర్ ఇచ్చింది.

సోమవారం చైనా విదేశాంగమంత్రి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటన కు సంబంధించిన ప్రశ్నను సంధించగా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్భిన్ స్పందించారు. అది తమ భూభాగంగా చెప్పుకొచ్చారు. చైనాలోని ప్రాంతాన్ని అభివృద్ధి చేసే హక్కు భారత్ కు లేదని ఆయన అన్నారు. భారత్ ఎత్తుగడలు సరిహద్దు ప్రశ్నను క్లిష్టతరం చేస్తాయి. ఇప్పుడున్న ప్రశాంతతకు భంగం కలుగుతుందని చెప్పారు.
Read More
Next Story