హింస చెలరేగిన 15 నెలల తరువాత.. మోదీతో సమావేశం అయినా..
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ తో ఢిల్లీలో సమావేశం అయ్యారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే హింస జరిగిన సంవత్సరన్నర తరువాత..
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో జాతుల సంఘర్షణ జరిగిన 15 నెలల తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తో న్యూఢిల్లీలో సమావేశం అయ్యారు. కేంద్రప్రభుత్వ వర్గాలు ఈ విషయంపై ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సదస్సు - రెండు సమావేశాలకు హాజరయ్యేందుకు బీరేన్ సింగ్ ఢిల్లీకి వచ్చారు.
క్లోజ్డ్-డోర్ మీట్
మణిపూర్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లతో ఒక క్లోజ్డ్ డోర్ సమావేశంలో ప్రధానిని కలిశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏడాది తర్వాత కూడా తన రాష్ట్రంలో జాతి హింస కొనసాగుతున్న పరిస్థితిని చర్చించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివాదం పరిష్కారానికి కేంద్రం, రాష్ట్రాలు రూపొందించిన ప్రణాళికలపై వారు చర్చించినట్లు సమాచారం. మణిపూర్ ముఖ్యమంత్రి ప్రధానిని ఒకరితో ఒకరు కలవబోతున్నారా అని కాంగ్రెస్ అంతకుముందు రోజు ప్రశ్నించింది కూడా.
"మణిపూర్ ప్రజలు అడుగుతున్న సాధారణ ప్రశ్న ఇది: శ్రీ ఎన్ బీరేన్ సింగ్, శ్రీ నరేంద్ర మోదీని విడివిడిగా కలుసుకుని, మే 3, 2023 రాత్రి మణిపూర్‌లో చెలరేగిన హింస పరిస్థితిని చర్చించారా?" అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అన్నారు.
చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు..
రాష్ట్రంలో శాంతిని నెలకొల్పలేకపోయినందుకు, జాతుల సమస్యపై చెలరేగిన హింస తరువాత రాష్ట్రాన్ని సందర్శించకపోవడానికి కారణాలు చెప్పాలని ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపల, బయట ప్రధానిని ప్రశ్నించాయి. ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది.
అయినప్పటికీ మణిపూర్ లో ఇంకా తెగల మధ్య ఇంకా శాంతి నెలకొనలేదు. దీనితో వీరి మధ్య చర్చల ప్రక్రియపై ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాల్సి వచ్చింది. లోయలో ఉన్న మెయిటీ కమ్యూనిటీ, మణిపూర్ కొండలలో ఉన్న కుకీ-జో తెగల మధ్య వివాదం చెలరేగింది. మోయితీ తెగలను కూడా ఎస్టీ తెగల్లో చేర్చాలని హైకోర్టు తీర్పు తరువాత ఈ వివాదం చెలరేగింది. తరువాత క్రమంగా అది జాతుల సంఘర్షణగా పరిణమించింది.
Next Story