
ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్
సరిహద్దులో మరో భారీ నిర్మాణాన్ని ఐఏఎఫ్ కు అప్పగించిన మోదీ
చైనా కు మూడు వందల కిలోమీటర్ల దూరంలోనే అడ్వాన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ పెసిలిటీ ఏర్పాటు, నేరుగా దిగి ప్రారంభించిన ప్రధాని
చైనా సరిహద్దులో భారత్ తన మౌలిక సదుపాయాలను వేగవంతం చేస్తోంది. తాజాగా ఈశాన్య భారతానికి కేంద్రంగా ఉన్న అస్సాంలో దిబ్రూగఢ్ జిల్లాలోని మోరన్ లో ఐఏఎఫ్ కు అవసరమైన అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని(ఈఎల్ఎఫ్) ఏర్పాటు చేసింది.
దీనిని ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాంతంలో రక్షణ, లాజిస్టిక్స్, విపత్తు ప్రతిస్పందనను పెంచే కీలకమైన వ్యూహాత్మక ఆస్తిగా ఇది ఉంటుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ నుంచి 300 కిలోమీటర్ల లోపే ఈ అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటిని భారత్ నిర్మించింది. ఇందుకోసం భారత ప్రభుత్వం దాదాపు రూ. వందకోట్లను ఖర్చు చేసింది. ఈ ల్యాండింగ్ సౌకర్యం భారత వైమానిక దళం (IAF) యుద్ధ విమానాలు, రవాణా విమానాలకు కీలకమైన వ్యూహాత్మక, బహుళ-ఫంక్షనల్ రన్‌వేగా ఉపయోగపడుతుంది.
దిబ్రూగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా..
పౌర, సైనిక ఉపయోగం కోసం రూపొందించబడిన ELF, అత్యవసర సమయాల్లో దిబ్రూగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. సైనిక, పౌర విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు మద్దతు ఇవ్వడానికి ELFను IAFతో సమన్వయంతో ప్రత్యేకంగా రూపొందించారు.
ద్వంద్వ-వినియోగ మౌలిక సదుపాయాలుగా ఉపయోగపడేలా ELFను నిర్మించారు. దీనిపై 40 టన్నుల వరకు యుద్ధ విమానాలను, 74 టన్నుల వరకు గరిష్ట టేకాఫ్ బరువు గల రవాణా విమానాలను తట్టుకునేలా నిర్మించారు. కాగా దేశంలోని మొట్టమొదటి ELF 2021లో రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ప్రారంభించారు.
వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం..
ఈశాన్య ప్రాంతంలో భారత సైన్యం వ్యూహాత్మక మౌలిక సదుపాయాలకు ELF ఒక ప్రధాన ప్రోత్సాహకంగా భావిస్తున్నారు. ల్యాండింగ్ సౌకర్యం అందించడం వలన ఈ ప్రాంతంలో IAFకి ఎక్కువ వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని అందజేస్తుంది. దిబ్రుగఢ్ విమానాశ్రయం లేదా చాబువా వైమానిక దళ కేంద్రం కీలక సమయాల్లో పనిచేయలేకపోతే అందుకు ప్రత్యామ్నాయంగా ఈఎల్ఫ్ ను ఉపయోగించుకోవచ్చు. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల సమీపంలో జరిగిన పరిణామాలకు త్వరితగతిన స్పందించేందుకు ఇది ఉపయోపడుతుంది.
సాంప్రదాయ వైమానిక స్థావరాలపై కంటే భిన్నంగా ELF ను అభివృద్ధి చేశారు. 4.2 కిలోమీటర్ల రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ కారిడార్ సైనిక, పౌర విమానాలు రెండింటికీ అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్‌గా పనిచేయడానికి అభివృద్ధి చేశారు.
ఘర్షణ సమయంలో దుర్బలంగా లేదా పనిచేయని సాంప్రదాయ వైమానిక స్థావరాల మాదిరిగా కాకుండా, హైవే ఆధారిత ల్యాండింగ్ సౌకర్యాలు వ్యూహాత్మక శక్తిని మన దళాలకు అందజేస్తాయి.
ఈ విభాగంలో సెంట్రల్ మీడియన్ లేదు. ఇది అడ్డంకులు లేకుండా విమానాల కదలికకు వీలు కల్పిస్తుంది. ఇరువైపులా రక్షణ కంచెలు నిర్మించారు. భద్రత కోసం తాత్కాలిక రోడ్‌సైడ్ ఇన్‌స్టాలేషన్‌లు తొలగించారు.
చైనా ను దృష్టిలో పెట్టుకునే..
ఈశాన్యంలో ఈ రకమైన మొదటి అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం ప్రధానంగా చైనానే లక్ష్యంగా నిర్మించారు. ఈఎల్ఫ్ వ్యూహాత్మక మౌలిక సదుపాయాలలో కీలకమైన అంశంగా మారింది.
ప్రస్తుతం ELFలు దేశంలోని పశ్చిమ, ఉత్తర, మధ్య భాగాలలో ఉన్నాయి. మోరాన్ వద్ద ఉన్న సౌకర్యం చైనా వైపు ఉన్న సరిహద్దు వైపు ఆవలి నుంచి ఎలాంటి దుస్సాహసం ఎదురైన తిప్పికొట్టడానికి ఉపయోగపడుతుంది. ఈఎల్ఎఫ్ కి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సీ-130 జే విమానంలో దిగి అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పాల్గొన్నారు.
Next Story

