Budget 2025: సుదీర్ఘ పని గంటలు, ప్రతికూల ప్రభావాలు
x

Budget 2025: 'సుదీర్ఘ పని గంటలు, ప్రతికూల ప్రభావాలు'

‘ఎక్కువ పని గంటలతో ఉత్పాదకత(Productivity) పెరిగినా.. ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.’ .. బడ్జెట్‌లో డబ్ల్యూహెచ్‌వో-ఐఎల్‌వో నివేదిక.


Click the Play button to hear this message in audio format

NR నారాయణ మూర్తి, L&T ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ లాంటి ప్రముఖులు దేశ ఆర్థిక వృద్ధికి ఎక్కువ గంటలు పనిచేయాలని సూచించిన నేపథ్యంలో..వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్సింగ్‌‌పై విస్తృత చర్చ జరుగుతోంది. ఇవాళ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలోనూ పనిగంటల అంశం ప్రస్తావనకు వచ్చింది. వారానికి 60 గంటలకు మించి పని చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. వివిధ అధ్యయనాల నివేదికలను ఇందులో ప్రముఖంగా ప్రస్తావించింది.

ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం.. ‘‘ఆఫీసుల్లో ఎక్కువ సేపు గడపడం మంచిది కాదు. రోజుకు 12, అంతకంటే ఎక్కువ సేపు పనిచేసే వ్యక్తులు అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది. వారానికి ఎక్కువ గంటలు పని చేయడం ఆరోగ్యానికి హానికరం. ఎక్కువ పని గంటలతో ఉత్పాదకత(Productivity) పెరిగినా.. వారానికి 55-50 గంటల మధ్య పని చేయడం ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమేనని డబ్ల్యూహెచ్‌వో-ఐఎల్‌వో నివేదిక స్పష్టం చేసింది’’ అని ఆర్థిక సర్వే వెల్లడించింది. అలాగే.. సుదీర్ఘంగా ఒకే దగ్గర ఎక్కువ గంటలు పని చేయడం మానసిక ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందని సపెయిన్‌ లాబ్స్‌ సెంటర్‌ ఫర్‌ హుమన్‌ బ్రెయిన్‌ అండ్‌ మైండ్‌ స్టడీ రిపోర్ట్‌ను ఎకనామిక్‌ సర్వే హైలెట్‌ చేసింది.

పని గంటలపై పరిమితులు విధించడం ఆర్థిక వృద్ధికి అవాంతరాన్ని కలిగించొచ్చని సర్వే అభిప్రాయపడింది. అలాగే కార్మికుల సంపాదన సామర్థ్యాన్ని దెబ్బ తీసే అవకాశం లేకపోలేదని తెలిపింది. సౌకర్యకర పని గంటల విధానం భారతదేశాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతుందని.. ఈ చర్యలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి తోడ్పడుతుంది అని ఆర్థిక సర్వే సూచించింది.

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. అనంతరం 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనామిక్‌ డివిజన్‌ ఈ సర్వేను రూపొందిస్తుంది.

Read More
Next Story