ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటి బిల్లు అప్రజాస్వామికం
x
ఎన్నకల కమిషన్ కార్యాలయం, న్యూఢిల్లీ

ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటి బిల్లు అప్రజాస్వామికం

"ఈ బిల్లుతో ఎన్నికల కమిషన్ లో ఇంకా ఏదైనా స్వతంత్ర సభావం మిగిలి ఉంటే అది మాయమవుతుంది."


ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల బిల్లు (Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Bill,2023) " ను మంగళవారం 12 డిసెంబర్ 2023న రాజ్యసభ ఆమోదించడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ జనచైతన్య వేదిక ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఆమోదం పొందేందుకు చేసిన ప్రయత్నం అత్యంత అప్రజాస్వామిక మరియు ఏకపక్ష పద్ధతి వేదిక అధ్యక్షుడు వి లక్మణ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

“ఇప్పటివరకు, చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం సెర్చ్ కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు మరియు భారత ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు. కానీ ఇప్పుడు, కొత్త బిల్లు సెలక్షన్ కమిటీ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించింది. దాని స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసిన మంత్రిని చేర్చాలని సిఫార్సు చేసింది. దీనర్థం, ప్రభుత్వం ఇప్పుడు తన స్వంత ఎంపిక ప్రకారం ఎన్నికల కమిషనర్లను ఎన్నుకునే ప్రత్యేక హక్కును తెచ్చుకొంది. అనేక అవకతవకల కారణంగా కాలక్రమేణా తటస్థ స్వభావాన్ని తీవ్రంగా కోల్పోతున్న ఎన్నికల ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకుంది,” అని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర బిజెపి ప్రభుత్వ తీసుకున్న ఈ చర్య వల్ల ఎన్నికల సంఘానికి ఏవైనా తటస్థ స్వభావ అవశేషాలుంటే అవి కూడా పోయినట్లే నని ఆయన అన్నారు.

ఇంతవరకు అమలులో ఉన్న ఎంపిక విధానంలో ఇప్పటివరకు ఉన్న చిన్నపాటి చెక్ అండ్ బ్యాలెన్స్ కూడా ఇప్పుడు రద్దు అవుతోందని ఇది ప్రజాస్వామ్య మూలాధార సూత్రాలను ఉల్లంఘించడమే కాక దేశంలో ఫాసిస్ట్ నిరంకుశ పాలనను బలోపేతం చేసే ముందడుగ అని లక్ష్మణ రెడ్డి వర్ణించారు.

" ఈ అప్రజాస్వామిక చర్యకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక భావాలున్న ప్రజలందరూ ఉద్యమించాలని, ఈ బిల్లును రద్దు చేయాలని బిజెపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి,” అని ఆయన ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేశారు.

Read More
Next Story