ఎలాన్ మస్క్ కొత్త పార్టీ..
x

ఎలాన్ మస్క్ కొత్త పార్టీ..

గతంలోనే పార్టీపెట్టడంపై ఓటింగ్..


Click the Play button to hear this message in audio format

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఇప్పటికే పార్టీ పేరును ప్రకటించారు. తన పార్టీకి ‘‘అమెరికా పార్టీ’’ అని పేరు పెట్టారు. అసలు మస్క్ కొత్త పార్టీ పెట్టడానికి ట్రంప్(Donald Trump), మస్క్ మధ్య బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చిచ్చు పెట్టిందని చెప్పుకోవాలి. ఈ బిల్లును ఆమోదిస్తే.. తాను కచ్చితంగా కొత్త రాజకీయ పార్టీ పెడతానని గతంలో మస్క్ హెచ్చరించారు. చెప్పినట్లుగానే చేశారు. మస్క్ అమెరికా ప్రస్తుత రాజకీయ పరిస్థితిని విమర్శిస్తూ.. "మనం ప్రజాస్వామ్యంలో కాదు..ఏక పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాం" అని చెప్పారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, సమాఖ్య శ్రామిక శక్తిని తగ్గించడానికి రిపబ్లికన్ ప్రచారంలో ప్రభుత్వ సమర్థత విభాగాధిపతిగా (DOGE) మస్క్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ట్రంప్ కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లను తన భారీ దేశీయ ఎజెండాను అమలు చేయమని ఒత్తిడి చేశారు. ఫలితంగా గురువారం వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం లభించింది. అయితే మస్క్ ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు మస్క్ అమెరికన్లకు వారి "స్వేచ్ఛ"ను తిరిగి ఇవ్వడానికి తన సొంత పార్టీని ప్రారంభించాడు. గతంలో మస్క్‌ పార్టీ పెట్టే అంశంపై ఎక్స్‌లోనూ ఓటింగ్‌ నిర్వహించారు. ఆసక్తికరంగా 80శాతం మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ క్రమంలో అప్పట్లోనే ‘ది అమెరికా పార్టీ’ అంటూ ఆయన చేసిన పోస్ట్‌ చర్చనీయాంశమైంది.

రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ తన కల నెరవేర్చుకున్నారు. ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’‌కు కాంగ్రెస్‌లోని ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లు.. దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజైన శుక్రవారం అధ్యక్షుడి సంతకంతో చట్ట రూపు సంతరించుకుంది. ట్రిలియన్లకొద్దీ డాలర్ల పన్ను మినహాయింపులతోపాటు 1.2 ట్రిలియన్‌ డాలర్ల విలువైన మెడిక్‌ఎయిడ్, ఆహార కూపన్ల కోతకు ఉద్దేశించిన చట్టమిది. అలాగే వలస సేవల విభాగానికి ఇది మరిన్ని నిధులను అందించనుంది. కాంగ్రెస్‌ బడ్జెట్‌ కార్యాలయం అంచనాల ప్రకారం.. పదేళ్లలో 3.3 ట్రిలియన్ల ద్రవ్యలోటును తీర్చనుంది. అదే సమయంలో 1.2 కోట్ల మంది ఆరోగ్య బీమాకు దూరమవుతారు.

Read More
Next Story