అక్కడ ప్రతీ ఇంచు భారత్ దే: అమిత్ షా
x

అక్కడ ప్రతీ ఇంచు భారత్ దే: అమిత్ షా

పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లోని ప్రతి ఇంచు భారత్ దే అని హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ హాయంలోనే పీఓజేకే పూర్తిగా భారత్ దే అంటూ తీర్మానం చేసిన సంగతిని..


కాంగ్రెస్ పై హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఓకే పై పలు ప్రశ్నలు లెవనెత్తుతూ కాంగ్రెస్ కు చెందిన మణిశంకర్ అయ్యార్, ఇంతకు ముందు నేషనల్ కాన్పరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మాట్లాడిన తీరుపై విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లో ప్రతీ ఇంచు భారత్ దే అని కుండబద్ధలు కొట్టారు. భారత్ నుంచి పీఓజేకే ను ఏ శక్తి వేరు చేయలేదని అన్నారు.

"మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉంది కాబట్టి దానిని గౌరవించాలని మాకు చెబుతున్నాడు. కొద్ది రోజుల క్రితం, ఇండి కూటమి నాయకుడు ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్‌లో అణు బాంబు ఉందని, పీఓకే గురించి మాట్లాడవద్దని అన్నారు. నేను కాంగ్రెస్, ఇండి కూటమికి పీఓజేకే గురించి చెప్పాలనుకుంటున్నాను. అది భారత్‌కు చెందినది, దానిని ఏ శక్తీ లాక్కోలేదు” అని జార్ఖండ్‌లోని ఖుంటిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా అన్నారు.
కాంగ్రెస్‌పై మండిపడిన ఆయన, “కాంగ్రెస్‌కు ఏమైందో నాకు తెలియదు, పీఓకే భారతదేశంలో భాగమని పార్లమెంటులో ఏకగ్రీవంగా మీరే తీర్మానం చేశారు, మీరు (కాంగ్రెస్) ఇప్పుడు పీఓకేపై ప్రశ్నలు సంధిస్తున్నారు. పీఓకేలోని ప్రతి అంగుళం భారత్‌కే చెందుతుందని బీజేపీ స్పష్టం చేస్తోంది’’ అని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరిన షా, జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి అవినీతిలో మునిగిపోయిందని విమర్శించారు.
"JMM నేతృత్వంలోని కూటమి రూ. 300 కోట్ల భూ కుంభకోణం, రూ. 1,000- కోట్ల మైనింగ్ స్కామ్, రూ. 1,000- కోట్ల MNREGA కుంభకోణంలో రూ. 40- కోట్ల మద్యం కుంభకోణంలో మునిగిపోయింది. పేద ప్రజల సొమ్మును తినడానికి మేము JMM నేతృత్వంలోని కూటమిని అనుమతించము," అని ఆయన అన్నారు. జేఎంఎం, కాంగ్రెస్‌లు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ 70 ఏళ్లుగా అడ్డంకులు సృష్టించిందని, అయితే ప్రధాని మోదీ ఐదేళ్లలో గుడి కట్టారని.. రాహుల్ బాబా తన ఓటు బ్యాంకుకు భయపడి రామమందిర శంకుస్థాపనకు రాలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏ గిరిజనుడిని కూడా దేశ అధ్యక్షుడిని ఎందుకు చేయలేదో చెప్పాలని రాహూల్ గాంధీని ప్రశ్నించారు.
Read More
Next Story