పేలిన ఈవీ చార్జింగ్ కారు: ఏడుగురి దుర్మరణం
x
కాలిపోయిన ఎలక్ట్రిక్ కారు

పేలిన ఈవీ చార్జింగ్ కారు: ఏడుగురి దుర్మరణం

వంట గ్యాస్ సిలిండర్లు పేలడంతో పెరిగిన ప్రమాద తీవ్రత


Click the Play button to hear this message in audio format

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ బుధవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. ఓ ఈవీ కార్ చార్జింగ్ పెడుతున్న సమయంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగి కనీసం ఏడుగురు మృతి చెందారు. ఈవీ చార్జింగ్ పాయింట్ పేలుడు తీవ్రతకు ఇంట్లో మంటలకు వంట గ్యాస్ సిలిండర్లు సైతం పేలిపోయాయి.

దాంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. బ్రజేశ్వరి అనెక్స్ కాలనీలోని ఆ ఇంట్లో తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటల మధ్య మంటలు చెలరేగాయని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కుందన్ మండ్లోయ్ జాతీయ మీడియాకు తెలిపారు.ఈ ఘటన తర్వాత ఒక చిన్నారి కనిపించకుండా పోయిందని, ఆమె కోసం గాలిస్తున్నామని ఏసీపీ తెలిపారు.

ఈవీ ఛార్జింగ్ పేలుడు

మూడు అంతస్తుల ఇంటి బయట ఒక కారుకు ఛార్జింగ్ పెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ మీడియాకు చెప్పారు. "ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు సంభవించింది, ఆ తర్వాత కారులో చెలరేగిన మంటలు ఇంటికి వ్యాపించాయి," అని ఆయన వెల్లడించారు. ఉదయం కావడంతో సంఘటనా స్థలంలో స్థానికులు లేరని అంతా నిద్రనుంచి మేల్కోనే సరికి ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు తెలిపారు..
ఇంటి తలుపులకు ఎలక్ట్రానిక్ తాళాలు బిగించి ఉండటంతో, పోలీసులు లోపలికి వెళ్లి సహాయ చర్యలు తీసుకోవడం కష్టమైందని అధికారి తెలిపారు. ఇంట్లోని వంటగ్యాస్ సిలిండర్లు కూడా పేలడం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి మరో కారణంగా చెప్పారు. "అగ్నిప్రమాదం సమయంలో ఇంట్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించాం," అని ఆయన చెప్పారు.

రెస్క్యూ ఆపరేషన్

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో దాదాపు 10 మంది ఉన్నట్లు సమాచారం అందిందని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమరేంద్ర సింగ్ తెలిపారు. ప్రభుత్వ మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ అరవింద్ ఘంగోరియా మాట్లాడుతూ, అగ్నిప్రమాదంలో మరణించిన ఏడుగురి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. "అగ్నిప్రమాదం సమయంలో రక్షించబడిన ఇద్దరిని కూడా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం, వారు మరో ఆసుపత్రిలో చికిత్స పొందాలని కోరడంతో వారిని డిశ్చార్జ్ చేశారు," అని ఆయన చెప్పారు.
Read More
Next Story