అల్ ఫలాహ్ యూనివర్సిటీ కార్యకలాపాల దర్యాప్తునకు S.I.T ఏర్పాటు..
x

అల్ ఫలాహ్ యూనివర్సిటీ కార్యకలాపాల దర్యాప్తునకు S.I.T ఏర్పాటు..

అదుపులో క్యాబ్ డ్రైవర్, మతాధికారి, ఉర్దూ ఉపాధ్యాయుడు


Click the Play button to hear this message in audio format

ఢిల్లీ(Delhi) ఎర్రకోట (Red fort) సమీపంలో నవంబర్ 10వ తేదీ జరిగిన కారు పేలుడు(Car Blast) ఘటనపై కేంద్ర దర్యా్ప్తు సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే NIA, ED, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రర్ స్క్వాడ్ (ATS), ఫరీదాబాద్ క్రైమ్ బ్రాంచ్, జమ్మూ, కాశ్మీర్ పోలీసులు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో మకాం వేశారు. ఇప్పటికే యూనివర్సిటీ పనిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమర్ నబీతో పాటు మరో ఇద్దరు ప్రొఫెసర్లు షాహీన్ షాహిద్, ముజమ్మిల్ గనై అరెస్టు చేశారు. తాజాగా నిన్న రాత్రి ఒక క్యాబ్ డ్రైవర్, ఒక మతాధికారి, ఒక ఉర్దూ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నాయి. క్యాబ్ డ్రైవర్‌ ఇంటి నుంచి ఒక గ్రైండింగ్ మెషిన్, మరో ఎలక్ట్రానిక్ డివైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ గనై క్యాబ్ డ్రైవర్ ద్వారా కొంతమంది విద్యార్థులు, ఇతర సహచరులకు సిమ్ కార్డులను అందిచాడని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.


క్యాబ్ డ్రైవర్‌కు గనై ఎలా పరిచయం?

పాల్వాల్ జిల్లా అసౌటి గ్రామానికి క్యాబ్ డ్రైవర్ ప్రస్తుతం ధౌజ్ గ్రామం బిల్లా కాలనీలో నివసిస్తున్నాడు. వేడి పాలు కొడుకు శరీరంపై పడడంతో కాలిన గాయాలకు చికిత్స కోసం అతనిని యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రికి తీసుకువచ్చినపుడు డాక్టర్ గనైని కలిశాడు. డాక్టర్ గనై క్యాబ్ డ్రైవర్‌కు చాలా సాయం చేశాడని అధికారులు పేర్కొన్నారు.

దర్యాప్తు సంస్థ అదుపులో ఉన్న మతాధికారి, ఉర్దూ ఉపాధ్యాయుడు నుహ్ జిల్లాలోని ఘసేరా గ్రామానికి చెందిన వారు. సోహ్నా సమీపంలోని రాయ్‌పూర్ గ్రామంలోని షాహి జామా మసీదు నుంచి వీరిద్దరిని తీసుకెళ్లినట్లు సమాచారం. బాంబు దాడికి కారణమైన డాక్టర్ ఉమర్ నబీ ఈ మసీదుకు తరచుగా ప్రార్థనలు చేయడానికి వచ్చేవాడని దర్యాప్తులో తేలింది. పేలుడుకు ముందు ఉమర్ ఆధ్వర్యంలో మసీదులో ఏమైనా సమావేశం జరిగిందా? అని తెలుసుకునేందుకు వీరిని ప్రశ్నిస్తున్నారు.

కాగా ఈ కేసులో మతాధికారికి ఎలాంటి సంబంధం లేదని ఆయన కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. షాహి జామా మసీదు హైవేపై ఉండడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ప్రార్థనలు చేయడానికి వస్తుంటారని తెలిపారు. దర్యాప్తు సంస్థల తీరుకు వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం విశ్వవిద్యాలయం వెలుపల నిరసనకు ప్లాన్ చేసినట్లు సమాచారం.

Read More
Next Story