
శబరిమల కేసును తటస్థ సంస్థ చేత దర్యాప్తు చేయించాలి: కేంద్ర హోమ్ మంత్రి
బంగారు దొంగతనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళను ఎఫ్ఐఆర్ కాపాడుతోందన్న అమిత్ షా
కేరళ ముఖ్య మంత్రి పినరయి విజయన్ శబరిమల గుడి దొంగతనం కేసులో ఒక తటస్థ సంస్థ చేత దర్యాప్తు చేయించాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కోరారు. గుడి ఆస్తిని కూడా కాపాడలేని వాళ్ళు ప్రజల విశ్వాసాలను కాపాడలేరని ఆయన అన్నారు.
రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సన్నద్దo చేయటానికి అక్కడ స్థానిక సంస్థలలో ఇటీవల ఎన్నిక అయిన వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాత్రమే దేవుడి పై విశ్వాసం వున్న వాళ్ల ప్రయోజనాలను కాపాడ గలదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
“ఎల్డీఎఫ్ కూటమిలో భాగమైన ఇద్దరిపై అనుమానం ఉంది. ఒక స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించి నిజా నిజాలు బయటపెట్టాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నందున వాళ్ల పై కూడా దర్యాప్తు జరగాలి,” అని ఆయన ఆరోపించారు.
“సిఎం దర్యాప్తును తటస్థ సంస్థకు అప్పచెప్పాలి. దీని కోసం బీజేపీ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తాము. ఇది ప్రజాస్వామ్యం,” అని విజయన్ను ఉద్దేశించి షా అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కమ్మునిజం పని అయిపోయింది. దేశంలో కాంగ్రెస్ ఆఖరి శ్వాస తీసుకుంటోంది. కేరళ అభివృద్ది బీజేపీతోనే సాధ్యం, అని చెప్తూ కేరళలో బీజేపీని గెలిపించడం ఒక సవాలు అది అంత సులభమైన పని కాదని కేంద్ర మంత్రి అభిప్రాయ పడ్డారు.

