విమానాల రాకపోకలు పున: ప్రారంభం.
x

విమానాల రాకపోకలు పున: ప్రారంభం.

భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మూసివేసిన విమానాశ్రయాలు తిరిగి సోమవారం నుంచి తెరుచుకున్నాయి.


Click the Play button to hear this message in audio format

భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదరడంతో.. దేశంలోని పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు పున: ప్రారంభమయ్యాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తొలుత మే 15వ తేదీ వరకు చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లూధియానా, భుంటార్, కిషన్‌గఢ్, పాటియాలా, సిమ్లా, ధర్మశాల, బటిండా, జైసల్మేర్, జోధ్‌పూర్, లేహ్, బికనీర్, పఠాన్‌కోట్, జమ్మూ, జామ్‌నగర్ ఎయిర్‌పోర్టుల్లో సర్వీసులను నిలిపివేశారు. కాల్పుల విమరణ అమల్లోకి రావడంతో పౌర విమానాలు రాకపోకలు మొదలయ్యాయి. అయితే వాణిజ్య విమాన సర్వీసులు ఇంకా ప్రారంభం లేదు.

విమాన సర్వీసులు మొదలైన ఎయిర్‌పోర్టులు (Airports)..

మొత్తం 32 విమానాశ్రయాల్లో సర్వీసులు మొదలయ్యాయి. అవి వరుసగా.. 1. అధంపూర్ 2. అంబాలా 3. అమృత్సర్ 4. అవంతిపూర్ 5. బటిండా 6. భుజ్ 7. బికానెర్ 8. చండీగఢ్ 9. హల్వారా 10. హిండన్ 11. జైసల్మేర్ 12. జమ్మూ 13. జామ్‌నగర్ 14. జోధ్పూర్ 15. కాండ్లా 16. కాంగ్రా (గగ్గల్) 17. కేశోడ్ 18. కిషన్‌గఢ్ 19. కులు మనాలి (భుంటార్) 20. లెహ్ 21. లూధియానా 22. ముంద్రా 23. నలియా 24. పఠాన్‌కోట్ 25. పాటియాలా 26. పోర్బందర్ 27. రాజ్‌కోట్ (హిరాసర్) 28. సర్సావా 29. సిమ్లా 30. శ్రీనగర్ 31. థోయిస్ 32. ఉత్తర్లై

ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రభుత్వ ఆదేశాలమేరకు సర్వీసులను పున: ప్రారంభించామని తెలిపింది. గతంలో మూసివేసిన మార్గాల్లో తిరిగి తమ విమానాలు తిరుగుతాయని పేర్కొంది.

ముమ్మర తనిఖీలు..

భారతదేశం అంతటా అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలలో భద్రతా ప్రోటోకాల్‌ అమలు చేయాలని BCAS ఆదేశించింది. విమానాశ్రయ నిఘా కెమెరాలు అన్ని సమయాల్లో పనిచేసేలా చూడాలని సూచించింది.

Read More
Next Story