మాల్దీవులకు ప్లైట్ టికెట్స్ క్యాన్సిల్.. షాక్ ఇస్తున్న భారతీయులు
x

మాల్దీవులకు ప్లైట్ టికెట్స్ క్యాన్సిల్.. షాక్ ఇస్తున్న భారతీయులు

పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవులకు భారతీయులు వరుసగా షాక్ లు ఇస్తున్నారు. దీంతో మాల్దీవులు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.


ప్రధాని నరేంద్ర మోడీ మీద, దేశంపై అవాకులు, చవాకులు పేలిన మాల్దీవులకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే వేలాది మంది భారతీయులు తమ మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకోగా, తాజాగా ఆన్ లైన్ ట్రావెలింగ్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ కూడా షాకిచ్చింది. తమ వెబ్ సైట్ నుంచి మాల్దీవులకు బుక్ అయిన అన్ని ప్లైట్ టిక్కెట్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా నిశాంత్ పిట్టి ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

దేశంపై అనుచిత వ్యాఖ్యాలు చేసినందుకు నిరసనగా ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా దేశీయ పర్యాటకాన్ని ప్రొత్సహించేందుకు లక్షదీవులను రావాలని పర్యాటకులను పిలుపునిచ్చారు. "దేశానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నాం, మాల్దీవులకు బుక్ చేసుకున్న అన్ని ప్లైట్ టిక్కెట్లను రద్దు చేస్తున్నాం" అని ఆయన పోస్ట్ చేశారు. "చలోలక్షద్వీప్.. అందమైన బీచ్ లు, అద్భుతమైన పగడపు దిబ్బలు మీకు స్వాగతం పలుకుతున్నాయి. ఇవి మాల్దీవులు, సీషెల్స్ కంటే బాగున్నాయి. భారత ప్రధాని ఇటీవల సందర్శించిన ప్రాంతాలను మీకు చూపించడానకి, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉత్తమ ప్యాకేజీలతో త్వరలో మీ ముందుకు వస్తాం" అని అందులో పేర్కొన్నారు.

దిద్దుబాటు చర్యలు చేపట్టిన మాల్డీవులు

భారత ప్రధాని పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను దేశ అధ్యక్షుడు మహ్మద్ రెయిజు మంత్రివర్గం నుంచి తప్పించారు. ప్రతిపక్షాల నుంచి తీవ్రంగా నిరసనలు రావడం, భారతీయులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకోవడంతో ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఈవిషయాలను ఆ దేశ మీడియా, సోషల్ మీడియాలోని చాలా పోస్టులు ధృవీకరిస్తున్నాయి.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో అనుచిత పోస్టులు చేసిన డిప్యూటీ మంత్రులు మాల్షా షరీఫ్, మరియం, అబ్దుల్లా మజిద్ తొలగించినట్లు తెలుస్తోంది. కాగా దేశ అధ్యక్షుడు మహ్మద్ మెయిజు చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన వారం పాటు అక్కడే ఉండన్నారు.

భారత ప్రధాని పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భారత విదేశాంగ శాఖ , మాల్దీవుల విదేశాంగ మంత్రికి తీవ్ర నిరసన తెలిపింది. వెంటనే దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా సమన్లు పంపిందని జాతీయ మీడియా వెల్లడించింది.

మాల్దీవుల మంత్రులు చేసిన పోస్టులకు భారతీయ సెలబ్రీటీలు సైతం స్పందించారు. దేశీయ టూరిజాన్ని అభివృద్ది చేసుకుందామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు దేశీయంగా ఉన్న పర్యాటక ప్రదేశాలను చూడాలని పేర్కొన్నారు. దేశంలో ఎన్నో ద్వీపాలు ఉన్నాయని, వాటి అందం.. విదేశీ బీచ్ ల కంటే అద్భుతంగా ఉంటాయని చెప్పారు.

మరోవైపు సోషల్ మీడియాలో బాయ్ కాట్ మాల్దీవుల హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అయింది. దీనితో పాటు ఆదేశంలోని అన్ని వెబ్ సైట్ లు గంటలపాటు పనిచేయలేదు.

టూరిజం ప్రధాన వనరుగా బతుకున్న మాల్దీవులు, అందులో ముఖ్యంగా భారత్ నుంచి అత్యధికంగా ఆదాయం అందుకుంటున్పటికీ న్యూఢిల్లీ వ్యతిరేక వైఖరిని కొంతకాలంగా అవలంబిస్తోంది. ప్రధాని మోదీ లక్షదీవులను సందర్శించి దేశీయ పర్యాటకాన్ని పెంచే ప్రయత్నం చేయగా, మాల్దీవుల మంత్రులు అనవరసంగా నోరు పారేసుకున్నారు.

దీంతో భారతీయులు ఏకంగా ఒక్కరోజే 8000 హోటల్ బుకింగ్స్ రద్దు చేసుకున్నారు. కొన్నివందల ప్టైట్ టికెట్స్ రద్దు చేసుకున్నారు. ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా బాయ్ కాట్ ఇండియా అనే నినాదంతో మెయిజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం భారతీయుల ఇచ్చిన షాక్ తో ఇప్పుడు డైలామాలో పడింది.

Read More
Next Story