ఢిల్లీ విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు
x

ఢిల్లీ విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు

118 విమాన సర్వీసులు బంద్.. 16 విమానాల దారి మళ్లింపు..


ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (DIAL) దట్టమైన పొగమంచు(Fog) కమ్మేసింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా 118 విమాన సర్వీసులను రద్దు చేశారు. 16 విమానాలను దారి మళ్లించారు. 130 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. రోజుకు DIAL నుంచి దాదాపు 1,300 విమానాల రాకపోకలుంటాయి.


పడిపోయిన గాలి నాణ్యత..

గాలి నాణ్యత బాగా పడిపోయింది. AQI 388గా నమోదయ్యింది. భారత వాతావరణ శాఖ (IMD) పొగమంచు కారణంగా ఉదయం 9 గంటల వరకు నగరానికి 'ఎల్లో' అలర్ట్ జారీ చేసింది. సఫ్దర్‌జంగ్ వద్ద ఉదయం 7:30 గంటలకు విసిబులిటీ 100 మీటర్లు ఉండగా, ఉదయం 8:30 గంటలకు అది 200 మీటర్లకు మెరుగుపడింది.

పొగమంచు, తక్కువ విసిబులిటీ కారణంగా విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయని, ప్రయాణికులు సహకరించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.

Read More
Next Story