మోదీ నుంచి మోదీత్వ వరకు: అధికారంలో 4,078 రోజులు..
x

మోదీ నుంచి మోదీత్వ వరకు: అధికారంలో 4,078 రోజులు..

ప్రధాని మోదీ 11 ఏళ్ల నిరంతర పాలన, ఆయన రాజకీయ వ్యూహాలు తదితర అంశాలపై ‘ది ఫెడరల్’ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్ శ్రీనివాసన్ అభిప్రాయాలు..


Click the Play button to hear this message in audio format

భారతదేశంలో వరుసగా రెండోసారి ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ(Indira Gandhi)కి పేరుంది. ఆ రికార్డును ప్రధాని మోదీ (PM Modi) బ్రేక్ చేశారు. జూలై 25 నాటికి ఆయన 4,078 రోజులు పదవీకాలం పూర్తి చేసుకున్నారు. మోదీ 11 ఏళ్ల నిరంతర పాలన, ఆయన రాజకీయ వ్యూహాలు, ఆర్థిక రికార్డు తదితర అంశాలపై ‘ది ఫెడరల్’ నిర్వహించిన డిబేట్‌లో ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్ శ్రీనివాసన్..విజయ్ శ్రీనివాస్‌తో చర్చించారు.

మోదీ మైలురాయి ఎందుకంత ప్రాధాన్యమైనది?

జూలై 25 నాటికి ప్రధాని మోదీ 4,078 రోజులు పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఇది 1966 నుంచి 1977 వరకు ఇందిరా గాంధీ పదవీకాలం 4,077 రోజుల కంటే కేవలం ఒక రోజు ఎక్కువ. కానీ ఇందిరా గాంధీ 1980లో తిరిగి అధికారంలోకి వచ్చి మరో నాలుగేళ్లు పనిచేశారు. దీంతో ఆమె మొత్తం పదవీకాలం 5,829 రోజులకు చేరుకుంది. ఆమె పూర్తి పదవీకాలాన్ని అధిగమించడానికి మోదీకి ఇంకా సమయం ఉంది. జవహర్‌లాల్ నెహ్రూ 6,130 రోజుల నిరంతర ప్రధానమంత్రి పదవి రికార్డు దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ ప్రధాని పదవి కాలంగా మిగిలిపోయింది.

ఇక మోదీ మైలురాయి ప్రత్యేకత ఏమిటంటే.. ఇంత కాలం పదవిలో కొనసాగిన మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి కావడమే. కాస్త లోతుగా పరిశీలిస్తే..ఆయన 24 ఏళ్లు నిరంతరాయంగా అధికారంలో ఉన్నారు. మొదట గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు తర్వాత ఇప్పుడు దేశ ప్రధానిగా. అదే మోదీ ఘనత.

ఈ లెక్కలు అటుంచితే.. మోదీ దేశ రాజకీయాలను ఎలా మార్చాడనే దానికే ప్రాముఖ్యత ఎక్కువ. ఆర్‌ఎస్‌ఎస్ సైద్ధాంతిక లక్ష్యం..భారత రాజకీయాలలో హిందుత్వాన్ని ఎక్కువకాలం చూడడం. అది మోదీ నాయకత్వంలో నెరవేరింది.


మోదీ పదవీకాలాన్ని ఇందిరా గాంధీ పదవీకాలంతో ఎలా పోలుస్తారు?

ఇందిరా గాంధీ నిస్సందేహంగా నిరంకుశురాలు. దేశంలో ఎమర్జెన్సీ విధించి పరాకాష్టకు చేరారు. కానీ ఆమె కూడా రికార్డులు నెలకొల్పారు. ముఖ్యంగా 1971 యుద్ధంలో పాకిస్తాన్‌ను ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ ఏర్పాటుకు ఆమె నాయకత్వం వహించింది. ఇది భారత్ సాధించిన సైనిక, దౌత్య విజయాల్లో ఒకటి.

మరోవైపు..బీజేపీ(BJP) దిగ్గజాలు అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ దశాబ్దాల వారసత్వాని మోదీ అందుకున్నారు. 2014 నుంచి రాజకీయాల్లో ఉన్న మోదీ హిందూత్వ ప్రవాహాన్ని ఎన్నికల ప్రధాన స్రవంతిలోకి మార్చారు. ఇది కేవలం పాలన గురించి కాదు. భారతదేశ రాజకీయ సంస్కృతిని పునర్నిర్మించడం గురించి.


మోదీని ‘ఎన్నికల దిగ్గజం’ అని పిలుస్తారు. ఎన్నికల్లో ఆధిపత్యం ఆయనకు ఎలా సాధ్యమైంది?

ఇది మోదీ-షా ఆపరేషన్. వారిద్దరి వ్యూహాలు బలంగా పనిచేస్తున్నాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌ను తీసుకోండి - అత్యంత వెనుకబడిన తరగతులు, దళితులు, అగ్ర కులాలను ఏకం చేయడం ద్వారా కులం కోటను విచ్ఛిన్నం చేశారు.

వారి ఎన్నికల విధానంలో చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, క్రమంగా వాటిని స్వీకరించడం జరుగుతుంది. మోదీ ప్రజాకర్షణ ఒక పెద్ద అసెట్. ఒకరకంగా ఇందిరా గాంధీతో పోల్చవచ్చు. కానీ సందేశం మాత్రం భిన్నంగా ఉంటుంది. మోదీ హిందూ మెజారిటీ భావాలను ఉపయోగించుకున్నారు. అందుకు అయోధ్య రామ జన్మభూమి ఉద్యమమే నిదర్శనం.

కొన్ని రాష్ట్రాల పట్ల మోదీ పక్షపాత థోరణితో ఉన్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలున్నా.. బీజేపీ చాలా రాష్ట్రాలకు విస్తరించింది. ముఖ్యంగా తూర్పు, దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలలో..కర్ణాటక, తెలంగాణతో సహా. కొన్ని రాష్ట్రాల్లో ఆధిపత్యం చెలాయించడానికి మాత్రమే పొత్తులను ఏర్పరచుకున్నారు.


దేశ ఆర్థిక వ్యవస్థను మోడీనామిక్స్ ఎలా రూపొందించింది?

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. FRBM చట్టం ప్రకారం ద్రవ్య లోటు నియంత్రణలో ఉంది.

కానీ లోతుగా విశ్లేషిస్తే కొన్ని విషయాలు తేటతెల్లమవుతాయి. నిధుల వికేంద్రీకరణపై రాష్ట్రాలు ఆందోళనలకు దిగాయి. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. నిరుద్యోగం ఎక్కువగానే ఉంది. PLI పథకాలు, సంస్కరణలు ఉన్నా.. తయారీ, మూలధన వస్తువుల రంగాలు ఆశించినంతగా పుంజుకోలేదు. ఉపాధి వృద్ధి మందకొడిగా ఉంది. ఉద్యోగ కల్పన ఆందోళన కలిగిస్తుంది.

తలసరి ఆదాయం తక్కువగానే ఉంది. భారతదేశం యొక్క $2,200 ను UK యొక్క $45,000 తో పోల్చండి. అసమానత స్పష్టంగా ఉంది. భారతదేశ GDP పెరుగుతోంది. కాని వృద్ధి మాత్రమే సరిపోదు. భారతదేశం తన ఆశయాలను నెరవేర్చుకోవాలంటే.. తయారీ, ఎగుమతులు, సేవలను ప్రారంభించాలి. అది ఇంకా జరగడం లేదు.


ఫారిస్ పాలసీ ఇమేజ్‌ను పునర్నిర్మించడంలో మోదీ విజయం సాధించారా?

దేశాలను సందర్శించడం, ప్రపంచ నాయకులను కౌగిలించుకోవడం, రాజనీతిజ్ఞతను ప్రదర్శించడం ద్వారా మోదీ విదేశాంగ విధానాన్ని విస్తృతంగా ప్రదర్శించారు. కానీ సంక్లిష్ట సంబంధాల నిర్వహణ అసలైన పరీక్ష. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికాతో వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకులు భారతదేశం-పాకిస్తాన్ ఘర్షణల సమయంలో తెరవెనుక మధ్యవర్తిత్వం వహించారన్న ప్రచారం జరుగుతోంది.

ప్రాంతీయంగా చూస్తే.. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలతో సంబంధాలు ఇప్పటికీ బలహీనంగానే ఉన్నాయి. శ్రీలంక ఇప్పుడు స్థిరంగా ఉంది. కానీ దక్షిణాసియా దౌత్యంపై శ్రద్ధ అవసరం. మోదీ ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అంచనా వేసింది, కానీ దాని విదేశాంగ విధాన వారసత్వాన్ని నిర్వచిస్తుంది.


మోదీ పాలన ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచిందని విమర్శకులంటున్నారు. మీరేమంటారు?

అవి కొంతవరకు వాస్తవమే. ఇటీవలి ఎన్నికలలో మైనారిటీ అభ్యర్థులకు బీజేపీ టిక్కెట్లు దాదాపుగా ఇవ్వలేదు. మీడియా కబ్జా, దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తాజా సంచలనం. ఇది పార్లమెంటులో నిరసనలకు దారితీసింది. ఈ టర్మ్‌లో పూర్తి మెజారిటీ లేకపోయినా.. మోదీ పాలనా శైలి ఇంకా తగ్గలేదు. ఏదైనా ఉంటే.. ఆయన వాక్చాతుర్యం, హిందూత్వ రాజకీయాలు అధికమయ్యాయి.

Read More
Next Story